Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 11 Apr 2024 09:13 IST

1. ఏపీ రాజధానిపై స్పష్టత లేదు.. కార్యాలయం ఏర్పాటుపై ఆర్‌బీఐ స్పందన

ఏపీకి రాజధాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వల్లే ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ జనరల్‌ మేనేజర్‌ సమిత్‌ తెలిపారు. అమరావతిలో ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటుపై గుంటూరుకు చెందిన జాస్తి వీరాంజనేయులు 2023లో ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. పూర్తి కథనం

2. తూచ్‌.. కోడ్‌ ఉంది.. మార్చిలో సున్నా బిల్లు.. ఈ నెలలో వెనక్కి..

గత నెలలో గృహజ్యోతి పథకం కింద సరూర్‌నగర్‌ సర్కిల్‌లో పలువురు వినియోగదారులకు సున్నా బిల్లు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండటంతో.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ వర్తిస్తుందని తెలియడంతో అర్ధాంతరంగా సున్నా బిల్లుల జారీ ఆపేసి మిగతా అర్హత ఉన్న వినియోగదారులకు బిల్లులు జారీ చేశారు.పూర్తి కథనం

3. హుద్‌హుద్‌ కంటే ప్రమాదకరమైన వైపరీత్యం జగన్‌: పురందేశ్వరి

ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటంలా.. ఎప్పుడెప్పుడు వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపుదామా అనే కసితో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఇంతమంది వచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం లోక్‌సభ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. హుద్‌హుద్‌, మిగ్‌జాం వంటి ప్రకృతి వైపరీత్యాల కంటే వైకాపా వైపరీత్యంతోనే రాష్ట్రం అన్ని విధాలా కుదేలైందన్నారు.పూర్తి కథనం

4. మేనరిక వివాహాలతో పిల్లల్లో నేత్ర వ్యాధుల ముప్పు

మేనరికం, ఇతర దగ్గర బంధువుల మధ్య వివాహాల కారణంగా వారికి పుట్టబోయే పిల్లలకు జన్యు వ్యాధులతోపాటు నేత్రాలకు సంబంధించిన సమస్యలు సంక్రమించే ముప్పు ఉందని ఎల్వీప్రసాద్‌ ఆసుపత్రి అధ్యయనంలో తేలింది. ఈ మేరకు వంశపారంపర్య కంటి వ్యాధుల(హెరిడిటరీ ఐ డీసీజెస్‌-హెచ్‌ఈడీ)పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య సంస్థ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.పూర్తి కథనం

5. జగన్‌ ‘లూటీ’ ఛార్జి

రాష్ట్రంలో ఏ రంగంలో తీసుకున్నా బాదుడే బాదుడు.. అని ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు సీఎం జగన్‌.. ఎన్నికల సందర్భంగా ప్రతి బహిరంగ సమావేశంలో ఎద్దేవా చేశారు. తాను అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చారు. ఒకే సారి దూరాన్ని బట్టి రూ.5 నుంచి రూ.120 పెంచేశారు. వచ్చే ఆదాయంతో కొత్త బస్సులు కొనుగోలు చేశారా అంటే అదీ లేదు.పూర్తి కథనం

6. ఎత్తుకు పైఎత్తు.. ప్రచారానికి కసరత్తు

రాజధాని పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీలు విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూకుడుగా వెళ్లాలని నిర్ణయించాయి. సభలు, ఇంటింటి ప్రచారాలతో ప్రజల్లోకి వెళ్లాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ కంటోన్మెంట్‌ అభ్యర్థితోపాటు మూడు స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటించింది. హైదరాబాద్‌ స్థానానికి ఆ పార్టీ నగర అధ్యక్షుడు సమీర్‌వాలీ ఉల్లాను అభ్యర్థిగా ప్రకటించాలని దాదాపుగా నిర్ణయించింది.పూర్తి కథనం

7. గోరుముద్దలో గుడ్లెక్కడ మామయ్యా?

మామయ్యా.. గోరుముద్ద ప్రచారం కోసమా? మాకు పౌష్టికాహారం కోసమా? అని ప్రభుత్వ పాఠశాలల బాలలు ప్రశ్నిస్తున్నారు. జగనన్న గోరుముద్ద అంటూ గొప్పలు చెప్పుకునే వైకాపా ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు కోడిగుడ్లను దూరం చేసింది. చెల్లింపులు లేక ఏప్రిల్‌ నుంచి జిల్లాÅలో పాఠశాలలకు కోడిగుడ్లు, చిక్కీల సరఫరా నిలిచిపోయింది.పూర్తి కథనం

8. అసెంబ్లీకి రారు.. ప్రచారానికి తిరుగుతున్నారు

కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా ఉన్నప్పుడు  నిబంధనల పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టి వాటిని పెద్దలకు అప్పగించి రూ.కోట్లు ఆర్జించారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. మెదక్‌ భారాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయనను ఓడించాలని పిలుపునిచ్చారు.పూర్తి కథనం

9. భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలైకి మద్దతుగా లోకేశ్‌ ప్రచారం

తమిళనాడు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్‌సభ అభ్యర్థి అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రచారం చేయనున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన కోయంబత్తూరులో పర్యటించనున్నారు. తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో నిర్వహించే సభలు, సమావేశాలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు.పూర్తి కథనం

10. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాహులా? ప్రియాంకా?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ (Congress) తరఫున ఎవరు పోటీ చేస్తారనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. గాంధీ కుటుంబంతో విడదీయరాని బంధం ఉన్న ఈ స్థానాల్లో తిరిగి వారే బరిలో ఉంటారా? ఇతరులను పోటీలో నిలుపుతారా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని