Tulasi Reddy: పులివెందులలో జగన్‌ ఓటమి తథ్యం: తులసిరెడ్డి

పులివెందుల నియోజకవర్గంలో జగన్‌మోహన్‌రెడ్డి ఓటమి తథ్యమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత తులసిరెడ్డి అన్నారు.

Published : 05 May 2024 11:27 IST

పులివెందుల నియోజకవర్గంలో జగన్‌మోహన్‌రెడ్డి ఓటమి తథ్యమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత తులసిరెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజలకు జగన్‌ దూరమయ్యారని, ఆయన పాలనలో పులివెందుల అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. ‘జగన్‌ ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి లేదు. మద్యం ఏరులై పారుతోంది. ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. రోడ్లు అధ్వానంగా మారాయి. డ్రిప్‌ ఇరిగేషన్‌ మూలన పడింది’ అని తులసిరెడ్డి మండిపడ్డారు.   

Tags :

మరిన్ని