Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 08 Jun 2023 13:02 IST

1. Opposition Meet: ‘450 స్థానాల్లో భాజపాపై ఒక్కరే పోటీ’.. విపక్షాల వ్యూహం ఇదేనా..?

వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో (2024 Lok sabha elections) భాజపా (BJP)ను ఉమ్మడిగా ఎదుర్కొనే విషయంలో వ్యూహాన్ని రూపొందించడానికి ప్రతిపక్ష పార్టీలు ముహూర్తం ఖరారు చేశాయి. ఈ నెల 23న బిహార్‌లోని పట్నా వేదికగా విపక్ష నేతలు కీలక సమావేశం (Opposition Meet) నిర్వహించనున్నారు. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికలో ఓ ముఖ్యమైన ఎజెండాపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. USA: రంగంలోకి పెన్స్‌.. ట్రంప్‌తో పోటీకి సై..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఊహించని వైపు నుంచి పోటీ ఎదుర్కొంటున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున రంగంలోకి దిగాలని భావిస్తున్న ట్రంప్‌ను ఆయన సన్నిహితుడు, మాజీ ఉపాధ్యక్షుడు పెన్స్‌ సవాలు చేస్తున్నారు. తాజాగా అధ్యక్ష ఎన్నికల కోసం పెన్స్‌ తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ట్రంప్‌ను విమర్శిస్తూనే ప్రచారాన్ని ప్రారంభించారు. 2021లో ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ హిల్స్‌ భవనంపై చేసిన దాడిని తీవ్రంగా విమర్శించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. Crime News: ముంబయిలో సహజీవన భాగస్వామిని ముక్కలు చేసి..ఆపై కుక్కర్‌లో ఉడికించి..!

శ్రద్ధావాకర్‌(Shraddha Walkar)హత్య కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇంకా దానిని మర్చిపోకముందే అదే తరహాలో మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మరోకేసు వెలుగుచూసింది. తన సహజీవన భాగస్వామి(Live-In-Partner)ని హత్యచేసి, ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేసిన వ్యక్తిని బుధవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. WTC Final: తొలి క్రికెటర్‌గా ట్రావిస్‌ హెడ్‌ ఘనత.. మొదటి రోజు ఆటలో రికార్డుల జోరు!

ఆస్ట్రేలియా - భారత్‌ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final 2023) తొలి రోజు ఆటలో రికార్డులు నమోదయ్యాయి. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ట్రావిస్‌ హెడ్‌ (146*: 156 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్స్‌) సెంచరీ బాదేశాడు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా హెడ్ అవతరించాడు. ప్రస్తుతం ఇది రెండో డబ్ల్యూటీసీ ఫైనల్‌ అనే విషయం తెలిసిందే. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. RBI Rate Hike: కీలక వడ్డీరేట్లు యథాతథమే

విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం ప్రకటించారు. రెపోరేటు (Repo rate)ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్‌ఎఫ్‌, బ్యాంక్‌ రేట్‌ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌పై పోక్సో కేసులో ఆమె మైనర్ కాదా..? ఆమె తండ్రి ఏం చెప్పారంటే..?

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్‌(Brij Bhushan Sharan Singh)పై చర్యలు తీసుకోవాలని కొద్దినెలలుగా రెజ్లర్లు ఆందోళన నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి, క్రీడల శాఖ మంత్రి జోక్యంతో ప్రస్తుతం దానికి తాత్కాలిక విరామం ఇచ్చారు. అయితే కుస్తీయోధుల ఫిర్యాదుతో దాఖలైన ఓ ఎఫ్‌ఐఆర్‌ విషయంలో కీలక విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. Harish Rao: అందుకే మన ‘మిషన్ కాకతీయ’ దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు

తెలంగాణ దశాబ్ది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు వివరించడంతో పాటు ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతోంది. జూన్‌ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు నుంచి 20 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగా ఇవాళ (జూన్ 8)న ‘ఊరూరా చెరువుల పండుగ’ను నిర్వహిస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం

దిల్లీ (Delhi) నుంచి బయల్దేరి సాంకేతిక లోపం కారణంగా రష్యా (Russia)లో దిగిన ఎయిరిండియా (Air India) విమాన ప్రయాణికులు ఎట్టకేలకు అమెరికా (USA) బయల్దేరారు. దాదాపు 39 గంటల తర్వాత ముంబయి నుంచి వెళ్లిన ప్రత్యేక విమానం.. గురువారం ఉదయం ఆ ప్రయాణికులను తీసుకుని శాన్‌ఫ్రాన్సిస్కో (San Francisco)కు టేకాఫ్‌ అయ్యింది. ఈ విషయాన్ని ఎయిరిండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. తండ్రీకుమారుడికి బెయిల్‌ మంజూరు

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో ఇద్దరికి బెయిల్‌ లభించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న తండ్రీకుమారుడు మైబయ్య, జనార్దన్‌లకు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈ ఇద్దరు నిందితులను ఏప్రిల్‌ 21న సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. WTC Final: అప్పటికే భారత ఆటగాళ్లలో అలసట కనిపించింది: సునీల్ గావస్కర్

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final 2023) మ్యాచ్‌లో టీమ్‌ఇండియా టాస్‌ నెగ్గి బౌలింగ్‌ను ఎంచుకుంది. ఆరంభంలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఓపెనర్ల వికెట్లు తీశారు. భోజన విరామం ముగిసిన తర్వాత రెండో ఓవర్‌లోనే కీలకమైన లబుషేన్ వికెట్‌ను పడగొట్టారు. మ్యాచ్‌ మన చేతిలోనే ఉందనుకున్న సమయంలో కాస్త పట్టు సడలించారు.ఈ క్రమంలో టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని