Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Jan 2022 13:11 IST

1. SCR: కొవిడ్‌ ఉద్ధృతి: 55 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. నేటి నుంచి ఈనెల 24వరకు 55 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. రద్దయిన రైళ్లలో తక్కువ దూరానికి సంబంధించినవే ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. AP News: గుడివాడ పర్యటనకు తెదేపా నేతలు.. అడ్డుకున్న పోలీసులు

కృష్ణా జిల్లా గుడివాడ పర్యటనకు వెళ్తున్న తెదేపా నిజనిర్ధారణ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పామర్రు-గుడివాడ రోడ్డు మలుపు వద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒకే వాహనానికి పోలీసులు అనుమతివ్వడంతో తెదేపా నేతలు వాగ్వాదానికి దిగారు. బారికేడ్లు దాటుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తెదేపా నేతలను పోలీసులు అడ్డుకోవడంలో స్వల్ప తోపులాట జరిగింది. తమ పర్యటనను అడ్డుకోవడాన్ని తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Tesla: టెస్లాకు రాయితీలిస్తాం.. కానీ షరతులు వర్తిస్తాయ్‌?

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా భారత ప్రవేశంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. కొన్ని రాయితీలివ్వాలంటూ సంస్థ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ కోరుతున్నారు. ఇతర కంపెనీలకు ఇవ్వని ప్రాధాన్యం టెస్లాకు మాత్రమే ఇవ్వడం సమంజసం కాదని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల మస్క్‌ చేసిన ఓ ట్వీట్‌ మరోసారి ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. దీంతో కేంద్రం ప్రభుత్వం టెస్లా ముందు ఓ ఆఫర్‌ను ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. IND vs SA : వారిద్దరిలో ఒకరు ఉండాల్సిందే.. చిన్నపాటి మార్పులు అవసరం

భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇవాళ కీలకమైన రెండో వన్డే మ్యాచ్‌ జరగనుంది. తొలి వన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్‌ రేసులో నిలబడాలని కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలోని టీమ్‌ఇండియా భావిస్తుండగా.. వరుసగా రెండో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని సఫారీలు ఉవ్విళ్లూరుతున్నారు. తొలి వన్డేలో శిఖర్‌ ధావన్‌, విరాట్ కోహ్లీ, శార్దూల్‌ ఠాకూర్‌ అర్ధ శతకాలతో రాణించినా భారత్‌కు ఓటమి తప్పలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇటీవల టీమ్‌ఇండియా ఓడిపోవడానికి ప్రధాన కారణమదే: గావస్కర్

5. India Corona: అంతకంతకూ పెరుగుతున్న మహమ్మారి ఉద్ధృతి.. కొత్త కేసులెన్నంటే..?

దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. క్రితం రోజు మూడు లక్షలు దాటిన కొత్త కేసులు.. తాజాగా 3,47,254కు పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 19 లక్షల మందికి పైగా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయి. పాజిటివిటీ రేటు 17.94 శాతానికి ఎగబాకింది. కేసుల పరంగా కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే దాదాపు 1.40 లక్షల కేసులు నమోదవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Amar Jawan Jyoti: అమర్‌ జవాన్‌ జ్యోతిని ఆర్పివేయట్లేదు.. కేంద్రం స్పష్టత

50 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతున్న అమర్‌ జవాన్‌ జ్యోతిని నేడు ఆర్పివేయనున్నట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జ్యోతిని పూర్తిగా ఆర్పివేయట్లేదని, అందులో కొంత భాగాన్ని తీసుకెళ్లి జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉండే జ్యోతితో కలపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నట్లు పేర్కొన్నాయి. దేశ రాజధానిలోని ఇండియా గేట్‌ వద్ద ఉండే ఈ జ్యోతిని శుక్రవారం ఆర్పివేసి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Samantha: చైతో విడాకులు.. స్టేట్‌మెంట్‌ డిలీట్ చేసిన సామ్‌.. ఆశ్చర్యంలో నెటిజన్లు

ఆన్‌స్క్రీన్‌ లవ్లీ పెయిర్‌గా.. మోస్ట్‌ బ్యూటిఫుల్‌ సెలబ్రిటీ కపుల్‌గా పేరు తెచ్చుకొన్న సమంత - నాగచైతన్య తమ నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ ఈ ప్రకటన చేసి సుమారు నాలుగు నెలలు అవుతోంది. ఈ నాలుగు నెలల్లో సమంత.. తన సోషల్‌మీడియా ఖాతాల నుంచి చైతన్య ఫొటోలు తొలగించింది. మరోవైపు చైతన్య కూడా సమంతతో విడిపోవడానికి గల కారణాన్ని ఇటీవల బయటపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గర్భంతో ఉన్న అటవీశాఖ ఉద్యోగినిపై దాడి..మాజీ సర్పంచి పైశాచికం

గర్భంతో ఉన్న అటవీ శాఖ ఉద్యోగినిపై గ్రామ మాజీ సర్పంచి, అతని భార్య కలిసి దాడి చేశారు. మహారాష్ట్రలోని సతారా జిల్లా పల్సవాడే గ్రామంలో ఈ దారుణం జరిగింది. నిందితుడు స్థానికంగా అటవీ నిర్వహణ కమిటీలో సభ్యుడు. గతంలో సర్పంచిగా కూడా పనిచేశాడు. తన అనుమతి లేకుండా ఒప్పంద ఉద్యోగులను వెంట తీసుకెళ్లారనే కోపంతో అటవీ శాఖ మహిళా గార్డ్‌పై కోపోద్రిక్తుడయ్యాడు. ఆమె గర్భంతో ఉందని చూడకుండా తన భార్యతో కలిసి దాడి చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ట్విటర్‌లో విజయసాయి, రఘురామ వాగ్బాణాలు

ఎంపీలు విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణరాజు మధ్య గురువారం ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం నడిచింది. ‘జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా! ఏదో ఆస్తినో (ప్రాపర్టీనో), వాహనాలనో అద్దెకు ఇచ్చినట్లు నిన్ను నువ్వే బాడుగకు ఇచ్చుకుని పెయిడ్‌ మైక్‌ అయ్యావు. లెక్క పంపిస్తే ట్వీట్లు, స్టేట్‌మెంట్లు ఏదైనా చేస్తావు. ఇంత నీచపు జీవితం భారంగా లేదూ? గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టేశావు కదా!’ అని విజయసాయి ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Raviteja: స్పీడ్‌ పెంచిన రవితేజ.. బెల్లంకొండ శ్రీనివాస్‌ సినిమా ఆగినట్టేనా?

స్టూవర్టుపురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఏకకాలంలో రెండు సినిమాలు తెరకెక్కుతుండటం ఇటీవల టాలీవుడ్‌లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అందులో ఒకటి రవితేజ కథానాయకుడిగా రానున్న ‘టైగర్‌ నాగేశ్వరావు’, మరొకటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రూపుదిద్దుకుంటోన్న ‘స్టూవర్టుపురం దొంగ’. ఇప్పటికే ‘స్టూవర్టుపురం దొంగ’ షూటింగ్‌ ప్రారంభం కావడం.. సాయి శ్రీనివాస్‌పై పలు కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని