Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తుల..

Published : 13 Dec 2022 16:55 IST

1. Adibatla kidnap case: యువతి కిడ్నాప్‌ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

ప్రేమించిన అమ్మాయి మరొకరితో పెళ్లికి సిద్ధపడిందని ఆ యువతిని ప్రియుడు అపహరించుకుపోయిన సంఘటన రాష్ట్ర రాజధాని శివారు మన్నెగూడలో ఈ నెల 9వ తేదీన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు విడుదల చేసిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Kalvakuntla Kavitha: భారాసతో భాజపా బ్రెయిన్‌ డ్యామేజ్‌: ఎమ్మెల్సీ కవిత

దేశంలో భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)(BRS)తో కొత్త చరిత్ర సృష్టిస్తామని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల నుంచి తమ పార్టీలోకి చేరికలు ఉంటాయని చెప్పారు. మీడియాతో ఇష్టాగోష్టిలో ఆమె మాట్లాడారు. మహిళలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) అవహేళన చేస్తున్నారని కవిత ఆరోపించారు. సరైన సమయంలో భాజపాకు బుద్ధి చెబుతామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Congress: కాంగ్రెస్‌లో కోవర్టులు.. వారితోనే పార్టీకి తీవ్ర నష్టం: దామోదర రాజనర్సింహ

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త కమిటీల చిచ్చు తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి కొండా సురేఖ తదితరులు అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా మరో సీనియర్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తన ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకి న్యాయం జరగడం లేదని ఆక్షేపించారు. హైకమాండ్‌ను గౌరవిస్తామని.. కానీ ఆత్మగౌరవాన్ని మించింది ప్రపంచంలో ఏదీ లేదని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం

ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భూముల రీసర్వే కోసం మున్సిపాలిటీ చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. బాపట్ల, పల్నాడు అర్బన్‌ డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. IND vs BAN: బంగ్లాతో టెస్టు సిరీస్‌కు వేళాయే.. భారత్ సత్తా చూపేనా..?

పసికూన అనుకొంటే బెబ్బులిలా రెచ్చిపోయి బలమైన టీమ్‌ను ఓడించి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. తాజాగా మరో సిరీస్‌ కోసం సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ఆ రెండు జట్లు ఏంటో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందిగా.. ఒకటి టీమ్‌ఇండియా కాగా.. మరొకటి బంగ్లాదేశ్‌. బుధవారం నుంచి భారత్-బంగ్లా మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. SBI ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. డిపాజిట్‌ రేట్లు పెంచిన బ్యాంకు

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)’ తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Fixed Deposit) వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లు నేటి (డిసెంబరు 13) నుంచే అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. కాలపరిమితులను బట్టి వడ్డీరేట్లను 15-100 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. కొత్త డిపాజిట్లతో పాటు పాత వాటిని పునరుద్ధరించినా తాజా రేట్లు వర్తిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Amit Shah: చైనా నుంచి కాంగ్రెస్‌ సంస్థకు డబ్బులు : అమిత్‌ షా

కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah) నిప్పులు చెరిగారు. లోక్‌సభలో (Lok Sabha) ప్రశ్నోత్తరాల సమయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని మండిపడ్డారు. చైనాపై సరిహద్దు వివాదంపై మాట్లాడిన ఆయన.. 1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్నారు. మరోవైపు చైనా రాయబార కార్యాలయం (China Embassy) నుంచి కాంగ్రెస్‌ నేతల సంస్థకు డబ్బులు చేరాయని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Pakistan: ఓఐసీ పాకిస్థాన్‌ బాకాలా పనిచేస్తోంది..: భారత్‌

ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ (ఓఐసీ) తీరుపై భారత్‌(India) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ విశ్వాసాన్ని కోల్పోతోందంటూ విమర్శించింది. ఇటీవల ఓఐసీ సెక్రెటరీ జనరల్‌ హిస్సెయిన్‌ బ్రహిమ్‌ తవా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను సందర్శించారు. భారత్‌ (India)జరుపుతున్న షెల్లింగ్‌తో ప్రభావితమైన వారి కోసం అక్కడ జరిపిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ ప్రకటన వెలువడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Loan written off: 5 ఏళ్లలో ₹10 లక్షల కోట్ల రుణాల రైటాఫ్‌!

గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.10లక్షల కోట్ల (రూ.10,09,511) విలువైన మొండి బాకీలను (NPA) బ్యాంకులు రైటాఫ్‌ (written off) చేశాయని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. రాజ్యసభలో ఓ సభ్యుడి ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala sitharaman) ఈ మేరకు సమాధానమిచ్చారు. నాలుగేళ్లు దాటిన మొండి బకాయిలను బ్యాంకులు (Banks) రైటాఫ్‌ పేరిట తమ బ్యాలెన్స్‌ షీట్ల నుంచి తొలగిస్తాయని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. YS Sharmila: వైతెపా అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. వరంగల్‌ జిల్లాలో షర్మిల పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు అనుమతి రద్దు చేసిన విషయం తెలిసిందే. పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను ఆదేశించినా పోలీసులు పాదయాత్రకు అనుమతివ్వకపోవడంతో వైతెపా నేతలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని