Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 02 Dec 2023 21:17 IST

1. Rahul Gandhi: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌.. పార్టీ నేతలకు రాహుల్‌ సూచనలు

మరి కొన్ని గంటల్లో తెలంగాణలో (Telangana Elections) ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ (Congress) అధిష్ఠానం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో దిల్లీ నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ.. తెలంగాణ నేతలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Cyclone Michaung: తుపాను ప్రభావం.. ఏపీలో 8 జిల్లాలకు నిధులు మంజూరు

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు - కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలో తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు సూచించారు. తుపాను కారణంగా విద్యుత్‌, రవాణాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Trains cancelled: ‘మిచౌంగ్‌’ తుపాను ఎఫెక్ట్‌.. 140కి పైగా రైళ్లు రద్దు

రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌. మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 140కి పైగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Digital arrest: డిజిటల్‌ అరెస్టు.. సరికొత్త సైబర్‌ స్కామ్!

సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. ఏ రూపంలో మన ఖాతాలకు కన్నం వేస్తారో తెలియడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. ‘డిజిటల్‌ అరెస్టు’ (Digital Arrest) పేరుతో ఆమె నుంచి రూ.11.11 లక్షలను సైబర్‌ నేరగాళ్లు (Cyber Crime) దోచుకున్నారు. నోయిడా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ తరహా కేసు నమోదవ్వడం ఇదే తొలిసారి. తమను ఐపీఎస్‌, సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్న నేరగాళ్లు ఈ దోపిడీకి పాల్పడినట్లు నోయిడా పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Gaza: మళ్లీ బాంబుల మోత.. 15 వేలు దాటిన మరణాలు!

ఇజ్రాయెల్‌ దాడులతో గాజా (Gaza) అతలాకుతలమవుతోంది. ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య కుదిరిన సంధి గడువు ముగిసిపోవడంతో స్థానికంగా మళ్లీ బాంబుల మోత మొదలైంది. ఈ క్రమంలోనే యుద్ధం (Israel Hamas Conflict) ప్రారంభం నుంచి ఇప్పటివరకు గాజాలో 15,200 మంది మృతి చెందినట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. చనిపోయినవారిలో మూడింట రెండొంతులు మహిళలు, చిన్నారులేనని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పెన్షనర్ల హక్కుల కోసం పార్టీ పెట్టి పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది: ఎల్వీ సుబ్రహ్మణ్యం

విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో పెన్షనర్ల హక్కుల కోసం రాజకీయ పార్టీ పెట్టి పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని విశ్రాంత ఐఏఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం (LV subramanyam) అన్నారు. విజయవాడలో ఏపీ పెన్షనర్స్ ఏర్పాటు చేసిన ఆవిర్భావ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెన్షనర్ల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని అందుకోసమే రాజకీయ పార్టీ పెట్టి తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తుందని ఏపీ పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బరాయన్ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. TS Elections: మరి కొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర.. తొలి ఫలితం భద్రాచలం నుంచే?

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒక్కో నియోజకవర్గానికి 14 నుంచి 28 టేబుళ్లు ఏర్పాటుచేశారు. ఉదయం 5గంటలకే పోలింగ్‌ సిబ్బంది, ఏజెంట్లు కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Voters List: ఓటర్ల జాబితాలో మర్పులు, చేర్పులకు ప్రత్యేక డ్రైవ్!

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ముసాయిదా ఓటర్ల జాబితా (Voters List) పరిశీలనకు ఎన్నికల సంఘం రెండు రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. మార్పులు, చేర్పుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసింది. అయితే ఫాం-7 దరఖాస్తులు పెట్టి వైకాపా నాయకులు తమ ఓట్లు తీసేస్తున్నారంటూ అనేక చోట్ల ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదులు పట్టించుకోవడం లేదని, బీఎల్వోలూ సరిగ్గా విధులకు హాజరుకాలేదని ఓటర్లు ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Leaning tower: ప్రమాదం అంచున ‘లీనింగ్‌ టవర్‌’.. ఇటలీలో హై అలర్ట్‌!

వెయ్యేళ్ల చరిత్ర కలిగిన గరిసెండా టవర్‌ (Garisenda tower) ఉనికి ప్రమాదంలో పడింది. ఇటలీ పట్టణంలో 150 అడుగుల పొడవున్న ఈ టవర్‌ కూలిపోయే ప్రమాదం ఉందని దానిని పర్యవేక్షిస్తున్న శాస్త్రీయ కమిటీ తాజాగా వెల్లడించింది. పురాతన ఈ టవర్‌ కొన భాగంలో బరువు ఎక్కువగా ఉండటం వల్ల 14వ శతాబ్ద కాలంలో ఇది దాదాపు 4 డిగ్రీల మేర వంగిపోయింది. దానిని యధాస్థితికి తీసుకొచ్చేందుకు అప్పట్లో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 2018లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీకెన్ని? తాజా ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ఒకేచోట!

ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో 2018 ఎన్నికల్లో ఏయే రాష్ట్రాల్లో ఏ పార్టీకెన్ని సీట్లు వచ్చాయి? తాజా ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు మొగ్గుచూపుతున్నాయో ఇప్పుడు చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని