Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 13 Jan 2022 17:20 IST

1. సీఎం సానుకూలంగా స్పందించారు.. త్వరలోనే ఆమోదయోగ్యమైన నిర్ణయం: చిరంజీవి

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో జరిగిన భేటీ సంతృప్తినిచ్చిందని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. సీఎం ఆహ్వానం మేరకు తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీసులో ఆయనతో చిరంజీవి భేటీ అయ్యారు. హైదరాబాద్‌ తిరుగుప్రయాణంలో గన్నవరం విమానాశ్రయంలో చిరంజీవి మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Viral Video : రెప్పపాటులో మృత్యువు నుంచి తప్పించుకున్నాడు !

2. ఎరువుల ధరలు తగ్గే వరకు ఆందోళనలు కొనసాగుతాయి: ఎర్రబెల్లి

కేంద్ర ప్రభుత్వం రైతులపై కక్ష సాధిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ధ్వజమెత్తారు. ఎరువుల ధరలు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎరువుల ధరల పెంపును సమర్థించుకునేలా భాజపా నేతలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో కొత్తగా 4,348 కరోనా కేసులు.. ఇద్దరి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 47,884 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 4,348 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ వల్ల నిన్న కృష్ణా జిల్లాలో ఒకరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 261 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,204 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘నన్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు పోరాడాలి’: ఎంపీ రఘురామ

రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీ నుంచి రఘురామ మీడియాతో మాట్లాడారు. ఉగ్యోగులు, భయపడుతున్న వైకాపా నేతలను మార్చుకోండని సీఎం జగన్‌కు సూచించారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడే వారిని తెచ్చుకోవాలన్నారు. క్షవరం అయిందని ఓటర్లకు రెండేళ్ల తర్వాత తెలిసిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మహోద్యమమే: బండి సంజయ్‌

సీఎం కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. రైతాంగ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధాని మోదీకి కేసీఆర్‌ రాసిన లేఖ పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని లేఖలో పేర్కొన్నారు. తెరాస ఇచ్చిన హామీలను వచ్చే ఉగాది నాటికి అమలు చేయాలని లేనిపక్షంలో రైతుల పక్షాన మరో మహోద్యమానికి శ్రీకారం చుడతామని బండి సంజయ్‌ హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Viral video : గర్భిణులూ అన్న కనికరం లేకుండా.. ఇనుప డబ్బాల్లో కుక్కి.. !

 

6. మార్కెట్లలో ఊగిసలాట.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం తీవ్ర ఊగిసలాటను ఎదుర్కొన్నాయి. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి దిగ్గజ షేర్లు రాణించినప్పటికీ.. కొన్ని షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సూచీలను కుదిపేశాయి. దీనికి తోడు మాక్రోఎకానమీ గణాంకాలు నిరాశజనకంగా ఉండటం కూడా మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో నేటి ట్రేడింగ్‌లో ఆద్యంతం ఒడుదొడుకుల్లో సాగిన సూచీలు స్వల్ప లాభాలను మాత్రమే దక్కించుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారత ప్రభుత్వంతో సవాళ్ల వల్లే.. టెస్లా రాక ఆలస్యం..!

భారత్‌లోకి టెస్లా కార్ల ప్రవేశంపై ఆ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ప్రభుత్వంతో ఎదురవుతున్న సవాళ్ల కారణంగానే భారత్‌కు టెస్లా రాక ఆలస్యమవుతోందని మస్క్‌ ట్విటర్‌లో ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలు ప్రభుత్వం ఖండించింది. సోషల్‌ మీడియా ద్వారా మస్క్‌.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్‌

దేశ రాజకీయాలకు కీలకమైన యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఇప్పుడు యావత్‌ దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. ఫిరాయింపులు, ఎత్తుకుపైఎత్తులతో రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ చేసిన ప్రకటన కూడా ఈ తరహాలోనిదే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ బాధితురాలి తల్లి ఆశా సింగ్‌ను కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించింది. నేడు పార్టీ విడుదల చేసిన జాబితాలో ఆమె పేరును వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఒమిక్రాన్‌ విజృంభణ వేళ.. అమెరికా ఆస్పత్రులకు చీకటి రోజులే!

అత్యంత వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉద్ధృతితో ప్రపంచ దేశాలు కొత్త వేవ్‌లను చవిచూస్తున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో నిత్యం రికార్డుస్థాయి కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 11 లక్షలు చేరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే, ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రత తక్కువగా కనపిస్తున్నప్పటికీ అవి అస్పత్రి చేరికలను మాత్రం నివారించలేక పోతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అలా జరిగితే ఐపీఎల్‌ మెగా వేలంలో పాల్గొనను: జోరూట్‌

త్వరలో జరగబోయే ఐపీఎల్‌ మెగా వేలంలో పాల్గొనాలా.. వద్దా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదని, దాని గురించి ఆలోచిస్తున్నానని ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు సారథి జోరూట్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఆడితే.. అది తన టెస్టు క్రికెట్‌పై ప్రభావం చూపదని అనిపిస్తేనే మెగా వేలంలో పాల్గొంటానని స్పష్టం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని