టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 18 Mar 2024 09:03 IST

1.ఈ నంబరు కాదు... ఆ నంబరు! వాలంటీర్ల మరో ఎత్తుగడ

ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో కొందరు వాలంటీర్లు కొత్త ఎత్తుగడ వేశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ‘వార్డు వాలంటీర్లను ఏ రూపంలోనూ ఎన్నికల విధుల్లో వినియోగించకూడదు. ఎన్నికల ప్రక్రియకు వారిని దూరంగా ఉంచాలి. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చర్యలు తప్పవు’ అనే హెచ్చరికలు ఉన్నాయి. పూర్తి కథనం

2. జగన్‌ మీ దత్తపుత్రుడు కాదా?

ముఖ్యమంత్రి జగన్‌తో అయిదేళ్లుగా అంట కాగుతూ కాంగ్రెస్‌ వైకాపా ఒకటేనని ప్రధాన మోదీ ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. జగన్‌ అరాచకాలను అడ్డుకోకుండా .. తిరిగి అడ్డగోలు సహాయ సహకారాలు అందించింది మీరు కాదా అని ఆమె ప్రశ్నించారు. బొప్పూడి ప్రజాగళం సభలో ప్రధాని చేసిన విమర్శలపై షర్మిల సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా ఆదివారం స్పందించారు.పూర్తి కథనం

3. గాజువాకలో అమర్‌నాథ్‌కు ఝలక్‌

విశాఖ జిల్లా గాజువాక వైకాపా అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న మంత్రి అమర్‌నాథ్‌కు పార్టీశ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆదివారం ఆయన గాజువాకలో తొలిసారిగా పార్టీశ్రేణులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఇటీవల వరకు ఇన్‌ఛార్జిగా పని చేసిన కార్పొరేటరు ఉరుకూటి రామచంద్రరావు(చందు), మరికొందరు గైర్హాజరయ్యారు.పూర్తి కథనం

4. ఆస్కార్‌కు గుర్తుగా సొంతూర్లో గ్రంథాలయం

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటునాటు’ పాట రాసి అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్‌ పురస్కారం పొందారు ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌. భూపాలపల్లి జిల్లా చల్లగరిగెలో జన్మించి తన కలంతో కమ్మని పాటలెన్నో రాస్తూ లక్షలాది ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. ఇటీవల వరంగల్‌ ఎస్‌.ఆర్‌. విశ్వవిద్యాలయం       ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించింది.పూర్తి కథనం

5. చిరుధాన్యం.. ఆరోగ్య భాగ్యం

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తప్పనిసరి.. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఎంతో అవసరం.. నిర్లక్ష్యం చేస్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. మరణాలు సంభవించే ప్రమాదం లేకపోలేదు.. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లేకపోడంతో గర్భిణులు, చిన్నారులు, బాలింతలు సరైన ఆహారం తీసుకోవడం లేదు. పూర్తి కథనం

6. ఎన్నికల వేళ.. సైబర్‌ వల

లోక్‌సభ ఎన్నికల వేళ సర్కారు పథకాల బూచి చూపిస్తూ సైబర్‌ నేరగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘జన్‌ధన్‌ యోజన’ ద్వారా ప్రజలందరి బ్యాంకు ఖాతాల్లో రూ.5 వేల చొప్పున జమ చేస్తోందంటూ ప్రచారం చేస్తూ.. సామాజిక మాధ్యమాలే వేదికగా నకిలీ పోస్టులు, లింకులు పంపిస్తూ బోల్తా కొట్టిస్తున్నారు. పదుల సంఖ్యలో బాధితులు డబ్బు పోగొట్టుకున్నట్లు తెలిపారు.పూర్తి కథనం

7. ఒకసారే మూల్యాంకనం చేశాం

అమరావతి: గ్రూపు-1 (2018) ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనం ఒకసారి మాత్రమే జరిగిందని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ వెల్లడించారు. గ్రూపు-1 ప్రధాన పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం గ్రూపు-1 ప్రిలిమ్స్‌ (స్క్రీనింగ్‌ టెస్ట్‌) 301 కేంద్రాల్లో జరిగింది. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో సీసీ కెమెరాల ద్వారా పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించిన సందర్భంగా గౌతం సవాంగ్‌ విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.పూర్తి కథనం

8. ఓటు హక్కుపై వేటు.. అదే జగన్‌ రూటు!

దొంగోడి దృష్టి ఎప్పుడూ మూట మీదే ఉన్నట్లు జగన్‌ చూపెప్పుడూ పదవిపైనే ఉంటుంది. దానికోసం ఎంతటి దారుణాలకైనా ఆయన సదా ‘సిద్ధం’గా ఉంటారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడటంలోనైతే జగన్‌ ఎప్పుడో పండిపోయారు. ఓట్లను గల్లంతు చేసే నేరాలకు 2019 ఎలెక్షన్లలోనే తెగబడింది వైకాపా. 2019 జనవరి 11 నుంచి మార్చి మధ్యకాలంలో 12.50 లక్షల ఓట్లను తీసేయాలంటూ ఎన్నికల సంఘానికి ఫాం-7 దరఖాస్తులు వెల్లువెత్తాయి.పూర్తి కథనం

9. నాడు-నేడు.. ఇక ఏనాడో?

తిరుపతి జిల్లా పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులన్నీ   అసంపూర్తిగానే మిగిలిపోతున్నాయి. గొప్పల కోసం పనులు ప్రారంభించినా నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. సొమ్ము చెల్లిస్తేనే పనులు పూర్తి చేస్తామంటూ గుత్తేదారులు స్పష్టం చేస్తున్నారు. పనులు అప్పగించిన తర్వాత గుత్తేదారులు తొలుత బాగానే చేశారు. వారు బిల్లులు పెట్టడంతో మంజూరు నిలిపివేశారు.పూర్తి కథనం

10. అగమ్యగోచరంగా భారాస పరిస్థితి: మల్లురవి

భారాస లక్క ఇల్లు లాంటిదని, ఓటమి మంటల్లో చిక్కుకొని కాలిపోతుండడంతో ఆ పార్టీ నాయకులు బయటపడుతున్నారని దిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి అన్నారు. ఆయన ఆదివారం దిల్లీలో తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని