Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..
1. చంద్రబాబు అక్రమ అరెస్టుపై గట్టి పోరాటం చేశారు
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును పార్లమెంటులో లేవనెత్తి దేశం దృష్టికి తీసుకెళ్లారంటూ తెదేపా ఎంపీలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అభినందించారు. దిల్లీలో తెదేపా ఎంపీలతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. వైకాపా ఎంపీల హేళనలు, మాటల దాడులను తట్టుకుని తెదేపా వాణిని సమర్థంగా పార్లమెంటులో వినిపించారని కొనియాడారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఉపాధ్యాయ ఖాళీలపై సమావేశానికో మాట
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై ప్రభుత్వ ప్రకటనలు గందరగోళంగా మారాయి. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 771 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. తాజాగా 8,366 పోస్టులు అవసరమని శాసనమండలిలో ప్రకటించారు. ఇప్పుడు ఇన్ని పోస్టులు ఎక్కడి నుంచి వచ్చాయి?పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. నేడు, రేపు విస్తారంగా వర్షాలు
తెలంగాణలో శని, ఆదివారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. శుక్రవారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో 4.4 సెం.మీటర్లు, నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 4, మంచిర్యాల జిల్లా భీమినిలో 3.5, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో 2.7 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. మహిళల భద్రతపై జగన్ సర్కారు చిత్తశుద్ధి ఇదేనా?
మహిళల భద్రతపై ఎప్పుడు ప్రస్తావించినా... ముఖ్యమంత్రి జగన్, మంత్రులు ‘దిశ బిల్లు’ గురించి తెగ గొప్పలు చెబుతారు. సుచరిత హోం మంత్రిగా ఉండగా.. అమలులో లేని దిశ చట్టం కింద శిక్షలు కూడా వేసేసినట్టు చెప్పి నవ్వులపాలయ్యారు. దిశ బిల్లు మూడున్నరేళ్లుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరే నానుతోందన్నది పచ్చి నిజం. ఆ విషయాన్ని శాసన సభ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అంగీకరించింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. జోరు పెంచిన కారు
వచ్చే నెల తొలి వారంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలుండడంతో.. విజయమే లక్ష్యంగా భారాస అధిష్ఠానం యత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయా అభ్యర్థులు మరింతగా ప్రజల్లోకి వెళ్లడానికి అవసరమైన కార్యాచరణలో వేగం పెంచింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. సముద్ర తీరంలో 144 సెక్షనా?
చంద్రబాబుకు సంఘీభావంగా గురువారం బాపట్ల జిల్లా కొత్త ఓడరేవు సముద్ర తీరంలో రూపొందించిన సైకత శిల్పం వద్ద నిరసన తెలిపిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్, పార్టీ బాపట్ల నియోజకవర్గ బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మ సహా 14 మంది నేతలపై బాపట్ల గ్రామీణ పోలీసులు కేసు పెట్టారు. 30 పోలీసు యాక్టు, 144 సెక్షన్‌ను వారు ఉల్లంఘించినట్లు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఉన్నతస్థాయి కమిటీ నివేదిక వచ్చేదాకా జీవో 111 షరతులు
జీవో 111లోని షరతుల సడలింపుపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ నివేదిక సమర్పించేదాకా ఆ జీవోలోని షరతులు కొనసాగుతాయని హైకోర్టుకు ప్రభుత్వం శుక్రవారం నివేదించింది. జీవో 111లోని షరతులను తొలగిస్తూ.. వాటిపై అధ్యయనం చేయడానికి వీలుగా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో 69 జారీ చేశామని, కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. స్మార్ట్‌ఫోన్‌లో దగ్గు విని వ్యాధి నిర్ధారణ
దగ్గులో తేడాలను స్మార్ట్ ఫోన్‌లో విని వ్యాధి స్థాయిని అంచనా వేసే విధానాన్ని స్పెయిన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కొవిడ్ కారణంగా బార్సిలోనాలోని డెల్‌మార్ ఆసుపత్రిలో చేరిన 70 మంది రోగుల దగ్గును తొలి 24 గంటల్లోనే స్మార్ట్‌ఫోన్‌లో రికార్డు చేశారు. వాటి హెచ్చు తగ్గులను బట్టి వ్యాధి తీవ్రతను విశ్లేషించే విధానాన్ని, అల్గొరిథమ్స్‌ను రూపొందించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ‘ఆసియా’ బరిలో మానుకోట రాకెట్!
మానుకోట బిడ్డ సిక్కిరెడ్డి బ్మాడ్మింటన్‌లో ఓరుగల్లు పేరు ప్రఖ్యాతలను నిలబెడుతున్నారు. శనివారం చైనాలోని హాంగ్‌జౌ నగరంలో ప్రారంభవుతున్న ఆసియా క్రీడల్లో దేశం తరఫున పాల్గొంటున్నారు. ఎడమ చేతి వాటంతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే ఆమె గోపిచంద్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. శనివారం ప్రారంభమయ్యే ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా సంగ్రామంలో సత్తా చాటి దేశ పతాకాన్ని రెపరెపలాడించాలని ఉమ్మడి జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. 80కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఖరారు!
పార్టీలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న గెలుపు గుర్రాల ఎంపిక వ్యవహారాన్ని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ దాదాపుగా ఓ కొలిక్కి తెచ్చింది. కమిటీ ఛైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు సభ్యులు సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు... మొత్తంగా 80కు పైగా స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టత వచ్చింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు.. -
TSRTC: పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శనివారం మధ్యాహ్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం అమల్లోకి రానుంది. -
APPSC: గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల.. పోస్టులు ఎన్నంటే?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. -
Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. -
సీఎంవో నుంచి నాకు ఎలాంటి సమాచారం లేదు: దేవులపల్లి ప్రభాకర్‌రావు
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. -
Revanth Reddy: తెలంగాణ విద్యుత్ రంగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
విద్యుత్ రంగంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, విద్యుత్‌శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ట్రాన్స్‌కో, జెన్కో అధికారులు పాల్గొన్నారు. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
KCR: కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. -
Revanth Reddy: ‘ప్రజాదర్బార్’ ప్రారంభం.. అర్జీలు స్వీకరించిన సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్ వద్దకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు గాయం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో చేరారు. కాలుజారి పడటంతో ఆయనకు గాయమైంది. -
ఉత్తరాంధ్ర దోపిడీ.. వైకాపా నేతలకు కనిపించలేదా!!
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
TS Assembly: శనివారం ఉదయం కొలువుదీరనున్న తెలంగాణ శాసనసభ
-
Mamata Banerjee: ‘ఈ యుద్ధాన్ని మహువా గెలుస్తుంది’: బహిష్కరణను ఖండించిన దీదీ
-
Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’.. ఆరోజు ఎంతో కంగారుపడ్డా: మీనాక్షి చౌదరి
-
Team India: యువ టాలెంట్‌కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్‌కు సవాల్: మాజీ క్రికెటర్
-
డిజిటల్ రుణాలపై ఆర్బీ‘ఐ’.. లోన్ అగ్రిగేటర్లకు త్వరలో రూల్స్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు