Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 09 Mar 2024 08:57 IST

1. జగనన్నా... ఇది మీ ఊరేనన్నా!

సీఎం జగన్‌ స్వగ్రామమంటే అహో.. ఓహో అనుకుంటే పప్పులో కాలేసినట్లే. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామమే ఆయనది. గ్రామంలో 1,359 కుటుంబాలు.. 5,119 మంది జనాభా, 3 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఆ గ్రామంలో సీˆఎం నివాసం లేకున్నా పూర్వీకులందరూ పుట్టిపెరిగిన గ్రామం. ఇప్పటికీ వైఎస్‌ కుటుంబానికి చెందిన స్వగ్రామంగానే పిలుస్తారు. పూర్తి కథనం 

2. పట్టణ గృహాలకు కేంద్రంతో కలిసి అడుగులు!

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి.. పట్టణాల్లో నిర్మించే గృహాలకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్రం అమలు చేస్తున్న అందరికీ ఇళ్లు పథకం కింద కొంతమేర నిధులను సమీకరించడం ద్వారా ముందడుగు వేయాలని నిర్ణయించింది. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గతంలోనూ ఆర్థికసాయం అందించింది. పూర్తి కథనం 

3. కానుకల ఎర

ప్రచార పథకాలు పనికిరావని అనుకుంటున్నారో... ఐదేళ్ల పాలన వ్యర్థమైందని అర్థమైందో... ‘అన్న’ మాటల్ని జనం నమ్మడం లేదని గుర్తించారో... కారణం ఏదైనా వైకాపా మూకల్లో దింపుడుకల్లం ఆశలు మొదలయ్యాయి. అందుకే ఎన్నికల కమిషన్‌ హెచ్చరికలనూ బేఖాతరు చేస్తూ.. షెడ్యూల్‌కు ముందే ప్రలోభాలకు తెరతీశారు! పూర్తి కథనం 

4. డొక్కు బస్సులతో ప్రయాణికుల అవస్థలు

డబాడబా శబ్దాలతో రోతపుట్టిస్తూ, స్టీరింగ్‌, చక్రాలు ఊడిపోతూ, యాక్సిల్స్‌ విరిగిపోతూ.. ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయో తెలియని కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్నారు. అసలే అధ్వానంగా ఉన్న రోడ్లతో బస్సులన్నీ డొల్లగా మారాయి. దూరప్రాంత సర్వీసులు కూడా ఘోరంగా తయారయ్యాయి.పూర్తి కథనం 

5. ఈతకెళ్తున్నారా.. జర జాగ్రత్త

వేసవి వచ్చిందంటే చాలు యువత, తల్లిదండ్రులు చిన్నారులను తీసుకొని చెరువులు, కాల్వల్లో స్నానాలకు వెళ్తుంటారు. సరదాగా వేసవి తాపం తీర్చుకోవడానికి వెళ్లి వారి కుటుంబాలకు తీరని శోకం మిగులుస్తున్నారు. ఇలా సరదా విషాదం నింపిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ వేసవిలో అయినా కనీస జాగ్రత్తలు పాటించి సరదా సమయాన్ని విషాదం కాకుండా చూసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.పూర్తి కథనం 

6. మన విమానం ఆకర్షణీయం

మనదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. కొవిడ్‌ ముందు నాటి ప్రయాణికుల సంఖ్యను ఇప్పటికే అధిగమించగా, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఇంకా ఆకర్షణీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కొవిడ్‌ ముందు దేశీయంగా ఏడాదికి దాదాపు 14 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 15 కోట్ల మందికి పైగా విమాన ప్రయాణాలు చేసినట్లు రేటింగ్‌, కన్సల్టెన్సీ సేవల సంస్థ ఇక్రా వివరించింది.పూర్తి కథనం 

7. కూలుతున్న కలల గూడు

ఇల్లు లేని పేదలెవరూ ఉండకూడదు.. నిర్మాణాల్లో నాణ్యత తప్పనిసరి.. పది కాలాలపాటు ఆ గూడులో పేదలు ఆనందంగా జీవించాలన్న సీఎం జగన్‌రెడ్డి మాటలు క్షేత్రస్థాయిలో సత్యదూరంలా ఉన్నాయి. మూడో ఆప్షన్‌ కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. పునాదులు చెదురుతున్నాయి. గృహ నిర్మాణాలకు అనుమతి పొందిన సంస్థలు ఆదిలో హడావుడి చేసి తర్వాత చేతులెత్తేశాయి.పూర్తి కథనం 

8. ‘సైనికుడైతే మాకేంటి.. లంచం ఇవ్వాల్సిందే..’

తను దేశరక్షణ కోసం సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడే కావచ్చు.. అవసరమైతే దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వొచ్చు.. అయితేనేం.. తహసీల్దార్‌ కార్యాలయంలో పని జరగాలంటే మాత్రం లంచం ఇవ్వాల్సిందే.. ఇచ్చేశాడు కూడా.. ఆ విషయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి కథనం 

9. సామూహిక వివాహాలకు ఆదర్శం.. మహాగాం

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాగాం గ్రామంలో ఏటా నిర్వహించే సామూహిక వివాహాలకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతుంది. ఆ గ్రామంలోని సంత్‌ శ్రీ కోట్నక సురోజీ మహారాజ్‌ గురుదేవ్‌ సేవాశ్రమం పేద, గిరిజన కుటుంబాలకు బాసటగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే ఆ ఆశ్రమం ముఖ్య ఉద్దేశం.పూర్తి కథనం 

10.సురేఖమ్మా.. కాపాడమ్మా!

మహిళా దినోత్సవం వేళ శుక్రవారం ఎంజీఎంకు వచ్చిన రాష్ట్ర ఆటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎదుట ఓ మహిళ తన భర్త నుంచి కాపాడాలని కన్నీళ్లు పెట్టుకుంది. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలానికి చెందిన రేణుక మంత్రి సురేఖను చూడగానే కాళ్లపై పడబోగా అంగరక్షకులు అడ్డుకున్నారు.పూర్తి కథనం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని