Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 Mar 2024 21:30 IST

1. వికసిత భారత్‌ మాత్రమే కాదు.. వికసిత ఆంధ్రప్రదేశ్‌ మా లక్ష్యం: మోదీ

రాష్ట్రంలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడాలని ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. ఏపీ మంత్రులు అవినీతి, అక్రమాల్లో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారన్నారు. తెదేపా, భాజపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభకు ప్రధాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగన్‌ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని.. వీటిని ఒకే కుటుంబం నడుపుతోందని విమర్శించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మా జెండాలు వేరు కావచ్చు.. కానీ అజెండా ప్రజా సంక్షేమమే : చంద్రబాబు

ఈ ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదేనని ఇందులో ఎవరికీ అనుమానం లేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం: పవన్‌ కల్యాణ్‌

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 19న సీడబ్ల్యూసీ కీలక భేటీ.. 20న కాంగ్రెస్‌ అభ్యర్థుల తదుపరి జాబితా!

సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడిన వేళ కాంగ్రెస్‌ పార్టీ (Congress) సర్వ సన్నద్ధత దిశగా కరసత్తు చేస్తోంది. ఈ ఎన్నికల బరిలో నిలిపేందుకు ఇప్పటికే రెండు విడతల్లో 82మందితో లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన హస్తం పార్టీ మిగతా అభ్యర్థుల ఖరారుతో పాటు మేనిఫెస్టో విడుదలపై కసరత్తు ముమ్మరం చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎమ్మెల్సీ కవితను కలిసిన కేటీఆర్‌, హరీశ్‌రావు

దిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను భర్త అనిల్‌తో పాటు భారాస ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌రావు కలిశారు. ఆమె అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ అనిల్‌ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయనున్నట్టు సమాచారం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. లైటింగ్‌ టవర్లపైకి అభిమానులు.. వెంటనే జోక్యం చేసుకున్న ప్రధాని

బొప్పూడిలో ఎన్డీయే కూటమి ప్రజాగళం సభలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రసంగిస్తున్న సమయంలో పలువురు అభిమానులు.. బారికేడ్లు, లైటింగ్‌ టవర్లపైకి ఎక్కారు. అది ప్రమాదకరం కావటంతో ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకున్నారు. దయచేసి కింద దిగాల్సిందిగా యువకులను కోరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఉద్యోగి.. ఈసీ తొలి వేటు

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగిపై ఈసీ తొలి వేటు వేసింది. అధికార వైకాపా నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీఆర్వోను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం దిమ్మిలి వీఆర్వోను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మియాపూర్‌లో చెడ్డీ గ్యాంగ్‌ కలకలం.. రూ.7.85 లక్షల చోరీ

మియాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చెడ్డీ గ్యాంగ్‌ సంచారం కలకలం రేపుతోంది. హఫీజ్‌పేట్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో శనివారం అర్ధరాత్రి కొందరు దుండగులు చోరీకి తెగబడ్డారు. చెడ్డీలు ధరించి మారణాయుధాలతో వచ్చిన వీరు.. స్కూల్ కార్యాలయంలోని కౌంటర్‌లో రూ.7.85 లక్షల నగదును దోచుకెళ్లారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మైదానంలో రోహిత్ ఏమన్నా మేం బాధపడం: కుల్‌దీప్‌ యాదవ్‌

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో (IND vs ENG) కుర్రాళ్లపై ఒత్తిడి లేకుండా చేయడంలో కెప్టెన్ రోహిత్ శర్మ విజయవంతమయ్యాడు. అరంగేట్రం చేసిన ఆటగాళ్లు తమ సత్తా చాటారు. మరీ ముఖ్యంగా సీనియర్‌ స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌ తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ తుది జట్టులో స్థానం దక్కించుకుని అద్భుత ప్రదర్శన చేశాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఐఫోన్‌ ఆర్డర్‌ క్యాన్సిల్‌.. ఫ్లిప్‌కార్ట్‌కు రూ.10,000 జరిమానా!

ఫ్లిప్‌కార్ట్‌కు (Flipkart) సెంట్రల్‌ ముంబయికి చెందిన ‘జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌’ రూ.10,000 జరిమానా విధించింది. ఓ కస్టమర్‌ ఆర్డర్‌ను అతని అనుమతి లేకుండా క్యాన్సిల్‌ చేసిందని తెలిపింది. అదనపు లాభం కోసమే ఈ - కామర్స్ సంస్థ అలా చేసిందని తేల్చింది. ఈ నేపథ్యంలో జరిమానా చెల్లించాల్సిందేనని తీర్పు వెలువరించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని