Corona: అక్టోబర్‌లో గరిష్ఠానికి మూడో ముప్పు..!
కరోనా థర్డ్‌వేవ్ అక్టోబర్ నాటికి గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చు.. పెద్దల వలే పిల్లలు ప్రభావితం కావొచ్చు.. ఇవి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సూచనలు.
ప్రధానమంత్రి కార్యాలయానికి నిపుణుల బృందం నివేదిక
దిల్లీ: కరోనా థర్డ్‌వేవ్ అక్టోబర్ నాటికి గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చు.. పెద్దల వలే పిల్లలు ప్రభావితం కావొచ్చు.. ఇవి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సూచనలు. నిపుణుల బృందం ఈ నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించినట్లు ఓ వార్త సంస్థ కథనం పేర్కొంది. ‘థర్డ్‌వేవ్ ప్రిపేర్డ్నెస్: చిల్డ్రన్ వల్నరబిలిటీ అండ్ రికవరీ’ శీర్షికన వెలువడిన ఈ నివేదిక అందుబాటులో ఉన్న సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
‘ఒకవేళ చిన్నారులు భారీగా కరోనా బారిన పడి, ఆసుపత్రిలో చేరే పరిస్థితి తలెత్తితే.. వైద్యసిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సులు వంటి వైద్యసేవలు అవసరానికి తగ్గట్టుగా అందుబాటులో లేవు. అలాగే చికిత్స సమయంలో వైరస్ సోకిన పిల్లలతో ఉండే సంరక్షకులు సురక్షితంగా ఉండేలా కొవిడ్ వార్డుల నిర్మాణం ఉండాలి’ అని నిపుణుల బృందం ప్రతిపాదించింది. అలాగే ప్రత్యేక అవసరాలున్న పిల్లలు, ఇతర వ్యాధులతో ఇబ్బందులు పడుతోన్న చిన్నారులకు టీకా వేయాల్సిన ఆవశ్యకతను గుర్తుచేసింది. ఇటీవల కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ మాట్లాడుతూ.. కేంద్రం థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని, చిన్నపిల్లల వైద్యసేవల వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఇంకోపక్క చిన్నారులకు టీకా అందించే దిశగా అడుగులు పడుతున్నాయి. మూడు రోజుల క్రితం అత్యవసర ఆమోదం పొందిన జైడస్ క్యాడిలా.. దేశంలో 12 ఏళ్లు దాటిన వారికి అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ మధ్య నుంచి టీకా సరఫరా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో మనదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో కల్లోలం సృష్టించిందో తెలిసిందే. వైద్య సేవల కొరత, మార్చురీలు, శ్మశానాలు నిండిపోవడం, అంత్యక్రియల కోసం గంటల తరబడి వేచి చూడటం ప్రతి ఒక్కరిని కలచివేసింది. అది తగ్గుముఖం పడుతున్న సమయంలో థర్డ్‌వేవ్ ఆందోళన మొదలైంది. దాంతో ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా వైద్య సదుపాయాల కల్పనకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రతి 100 వైరస్ పాజిటివ్ కేసుల్లో 23 మందికి ఆసుపత్రిలో వైద్య సేవలు అందేలా సన్నాహాలు చేయాలని నీతి ఆయోగ్ ప్రభుత్వానికి సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్‌కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్‌లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్‌లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్‌బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మొదట రాయ్‌బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్‌ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్‌సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్‌ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్‌కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్‌ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్‌ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్‌ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది.