చర్చలకు వస్తాం..రైతు సంఘాలు

కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు రైతు సంఘాల సమాఖ్య అంగీకరించింది. ఈ నెల 29న (మంగళవారం) ఉదయం 11గంటలకు చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని  40 రైతు సంఘాల తరఫున కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శికి ........

Published : 26 Dec 2020 17:52 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు రైతు సంఘాల సమాఖ్య అంగీకరించింది. ఈ నెల 29న (మంగళవారం) ఉదయం 11గంటలకు చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని  40 రైతు సంఘాల తరఫున కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌కు లేఖ రాశారు. ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు సమావేశమైన రైతు నేతలు కేంద్రం నుంచి వచ్చిన ప్రతిపాదనలు, తాజా లేఖపై చర్చించినట్టు తెలుస్తోంది. అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించేందుకు రైతు సంఘాలు ఎప్పుడూ చర్చలకు  సిద్ధంగానే ఉన్నాయని రైతు నేతలు పేర్కొన్నారు.

ముఖ్యంగా మూడు వ్యవసాయ చట్టాలు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వడం, పంట వ్యర్థాలు తగులబెట్టే విషయంలో నమోదుచేసిన కేసులు, విద్యుత్‌ ముసాయిదా బిల్లు-2020లో మార్పులు చేర్పులు తదితర అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే మంగళవారం ఉదయం చర్చలకు వస్తామని స్పష్టంచేశారు. రైతులపై కేసుల విషయంలో కేంద్రం ఆలోచించాలని సూచించారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ ముసాయిదా బిల్లులో రైతుల ప్రయోజనాలను పరిరక్షించేలా మార్పులు చేయాలన్నారు. రైతు సంఘాల నేతలు రాసిన లేఖపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై అన్నదాతలు గత నెల రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు దఫాలుగా చర్చలు జరిగినా ఫలితం లేకపోవడంతో దిల్లీ సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిలో అన్నదాతలు పోరాటం కొనసాగిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని