50 శాతం సామర్థ్యం ఉన్న టీకానే పరిగణలోకి..!

భారత్‌లో అత్యంత వేగంగా టీకా తెచ్చేందుకు ఉన్న అన్ని మార్గాలను ప్రభుత్వం అనుసరిస్తోంది. మూడు ప్రయోగ దశల్లో కనీసం 50శాతం మందిలో ఫలితాలు చూపించినా భారత్‌లో వినియోగానికి ఆమోదముద్రవేసే అంశాన్ని భారత ఔషధ నియంత్రణ విభాగం పరిశీలిస్తోంది. ‘‘కొవిడ్‌ టీకా అత్యంత శక్తివంతంగా ఉండేలా చూస్తాము.

Published : 22 Sep 2020 15:24 IST

న్యూదిల్లీ: భారత్‌లో అత్యంత వేగంగా టీకా తెచ్చేందుకు ఉన్న అన్ని మార్గాలను ప్రభుత్వం అనుసరిస్తోంది. మూడు ప్రయోగ దశల్లో కనీసం 50శాతం మందిలో ఫలితాలు చూపించినా భారత్‌లో వినియోగానికి ఆమోదముద్రవేసే అంశాన్ని భారత ఔషధ నియంత్రణ విభాగం పరిశీలిస్తోంది. ‘‘కొవిడ్‌ టీకా అత్యంత శక్తివంతంగా ఉండేలా చూస్తాము. ప్రాథమికంగా ఆ టీకా ప్లెసిబో కంట్రోల్డ్‌ ఎఫీషియన్సీ పరీక్షల్లో కనీసం 50శాతం ఫలితాలను చూపాలి’ అని సెంట్రల్‌ డ్రగ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ సోమవారం తయారు చేసిన డ్రాఫ్ట్‌ రెగ్యూలేటరీ మార్గదర్శకాల్లో పేర్కొంది. కరోనా సోకి లక్షణాలు లేని వారు కూడా ఈ ప్రయోగాల్లో పాల్గొనవచ్చని వివరణ ఇచ్చింది. కాకపోతే వీరిలో తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉండకూడదని పేర్కొంది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ప్రమాణాలనే పరిగణలోకి తీసుకొంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ సోమవారం మాట్లాడుతూ‘‘ 70శాతం సామర్థ్యం ఉంటే మంచిది. 50శాతం సామర్థ్యం దాటిన  టీకాలను పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ టీకాల ప్రయోగ పరీక్షలు ఏ విధంగా ముగిశాయనేది చాలా  కీలకం’’ అని ఆమె పేర్కొన్నారు. 30శాతం సామర్థ్యం ఉన్న టీకాలను అత్యల్పస్థాయిలో పరిగణలోకి తీసుకుంటామని ఆమె అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని