గో సంరక్షణకు ప్రత్యేక కేబినెట్‌

రాష్ట్రంలో ఆవుల సంరక్షణకు ప్రభుత్వం ఒక ప్రత్యేక  కేబినెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ బుధవారం ప్రకటించారు

Published : 18 Nov 2020 13:48 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో గోవుల సంరక్షణకు ఒక ప్రత్యేక కేబినెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ బుధవారం ప్రకటించారు. పశు సంవర్థకశాఖ, అటవీ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమ విభాగాలు ఇందులో భాగంగా ఉంటాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఆవుల సంరక్షణను ప్రోత్సహించేందుకు ఈ కేబినెట్‌ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మొదటి సమావేశం ఈ నెల 22 మధ్యాహ్నం 12 గంటలకు అగర్‌మాల్వాలోని గోపాష్టమిలో జరగనుందని ఆయన ట్విటర్‌ ద్వారా తెలిపారు. ప్రేమ పెళ్లిళ్ల పేరిట జరిగే మత మార్పిడిలకు (లవ్‌ జిహాద్‌) వ్యతిరేకంగా ఓ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించిన మరుసటిరోజే ఈ కేబినెట్‌ను మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని