Agnipath: అగ్నివీరుల నియామక పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల.. రేపట్నుంచే దరఖాస్తులు

అగ్నివీరుల నియామక పరీక్ష(Agniveer recruitment exam)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. రెండు దశల్లో చేపట్టే ఈ నియామకాలకు సంబంధించి ఏప్రిల్‌ 17 నుంచి ఆన్‌లైన్‌ పరీక్ష జరగనుంది.

Updated : 15 Feb 2023 21:27 IST

హైదరాబాద్‌: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’(Agnipath) స్కీమ్‌ కింద నిర్వహించే అగ్నివీరుల నియామక పరీక్షకు నోటిఫికేషన్‌ (Agniveer recruitment) విడుదలైంది. ఈ పరీక్ష కోసం ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 వరకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జోన్‌ల వారీగా నోటిఫికేషన్లను వేర్వేరుగా విడుదల చేశారు. రెండు దశల్లో చేపట్టే ఈ ఎంపిక ప్రక్రియలో తొలుత ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ చేపట్టి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఏప్రిల్‌ 17నుంచి అగ్నివీర్‌ ప్రాథమిక అర్హత పరీక్ష జరగనుంది. అగ్నివీరులుగా చేరేందుకు https://www.joinindianarmy.nic.in/index.htmలో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరుగుతుందని.. ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పే దళారుల్ని నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ఏపీ జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి

అభ్యర్థులకు కొన్ని కీలక సూచనలు.. 

  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం అభ్యర్థులు joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. తమ అర్హతకు సంబంధించిన వివరాలను చెక్‌ చేసుకొని ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేయాలి.
  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 వరకు కొనసాగుతుంది. 
  • అభ్యర్థులు ఆన్‌లైన్‌ పరీక్ష కోసం రూ.250ల చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
  • దరఖాస్తులు చేసేటప్పుడు నకిలీ/అసంపూర్ణంగా/ తప్పుగా ఉంటే తిరస్కరిస్తారు. 
  • ప్రస్తుతం వాడుకలో ఉండే ఈ-మెయిల్  ఐడీ, మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ను ఇవ్వాలి.
  •  అభ్యర్థులు ఐదు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకొనే వీలు ఉంది. తొలి మూడు ఎంపికల ఆధారంగా పరీక్ష కేంద్రాన్ని కేటాయించేందుకు ప్రాధాన్యం ఇస్తారు.  
  • అభ్యర్థులు తమ ఆధార్‌ నంబర్‌ను ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. 
  • అగ్నివీర్‌ల విద్యా అర్హతలు, ఫిజికల్‌/మెడికల్‌ స్టాండర్డ్స్‌, జాబ్‌ స్పెసిఫికేషన్‌ తదితర వివరాల కోసం ఈ కింద పీడీఎఫ్‌లో చూడొచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని