Azadi Ka Amrit Mahotsav: ఆరు ఖండాల్లో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌..!

భారత నౌకాదళం ఆరు ఖండాలు, మూడు సముద్రాల్లోని ఆరు టైమ్‌జోన్లలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాలు నిర్వహంచింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని భారత యుద్ధనౌకలపై త్రివర్ణ పతాకాన్ని

Updated : 15 Aug 2022 11:17 IST

ఉత్సాహంగా ఇండియన్‌ నేవీ కార్యక్రమాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత నౌకాదళం ఆరు ఖండాలు, మూడు సముద్రాల్లోని ఆరు టైమ్‌జోన్లలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని భారత యుద్ధనౌకలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. విదేశాల్లో ఉంటున్న పలువురు భారత వాసులు ఈ కార్యక్రమాలు చూసేందుకు ఆయా ఓడరేవుల వద్దకు ఉత్సాహంగా వచ్చారు. చాలా మంది యుద్ధ నౌకలు ఎక్కి ఫొటోలు తీసుకొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారత యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ సూర్య సింగపూర్‌లోని ఛాంగై నౌకాదళ స్థావరానికి చేరుకొంది. 

* దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌లో ఉన్న భారత నేవీకి చెందిన ఐఎన్‌ఎస్‌ తరక్ష్‌పై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బంది పరేడ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమం రియో డి జెనిరియోలో జరిగింది.

* ఐరోపాలోని సముద్ర జలాల్లో ఉన్న భారత నౌక ఐఎన్‌ఎస్‌ తరంగిణిపై సిబ్బంది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ నౌక లండన్‌లోని కాన్‌ వార్ఫ్‌ వద్ద వెస్ట్‌ఇండియా డాక్స్‌లో లంగర్ వేసి ఆగింది. ఈ సందర్భంగా జెండా వందనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందల మంది భారతీయులు పాల్గొన్నారు.

* కెన్యాలోని ముంబాస పోర్టుకు భారత యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ తబర్‌ చేరుకొంది. ముంబాస నగరంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాలు నిర్వహించారు. వీటిల్లో నౌక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

* ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా నౌకాదళం నిర్వహిస్తోన్న కార్యక్రమం కోసం భారత యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ సుమేధ ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నౌకాశ్రయానికి చేరుకొంది. అక్కడ భారతీయులు పెద్ద ఎత్తున నౌకను సందర్శంచారు. 

* అమెరికాలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో పాల్గొనేందుకు భారత యుద్ధ నౌక శాన్‌ డియాగో పోర్టుకు చేరుకొంది.







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని