చైనా యాప్‌లపై నిషేధాన్ని పొడిగించిన కేంద్రం

టిక్‌టాక్‌ సహా వివిధ చైనా యాప్‌ల వినియోగంపై దేశీయంగా విధించిన నిషేధాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు యాప్‌ యాజమాన్య సంస్థలకు కేంద్ర ఎలక్ట్రానిక్‌, ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసినట్లు...

Published : 24 Jan 2021 11:37 IST

దిల్లీ: టిక్‌టాక్‌ సహా వివిధ చైనా యాప్‌ల వినియోగంపై దేశీయంగా విధించిన నిషేధాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు యాప్‌ యాజమాన్య సంస్థలకు కేంద్ర ఎలక్ట్రానిక్‌, ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. నిషేధం పొడిగింపుపై స్పందించిన టిక్‌టాక్‌.. భారత చట్టాలు, నిబంధనలను పాటించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారుల గోప్యతే తమ తొలి ప్రాధాన్యమని టిక్‌టాక్‌ పేర్కొంది.  భద్రత విషయంలో ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.

దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, రక్షణ, భద్రత, ప్రయోజనాల దృష్ట్యా గతేడాది జూన్‌లో టిక్‌టాక్‌ సహా చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్‌లో పబ్జీతోపాటు మరో 118 యాప్‌లను సైతం షేధిత జాబితాలో చేర్చింది.

ఇవీ చదవండి...

టిక్‌టాక్‌ స్టార్‌ ఆత్మహత్య

చీమల్లో రెండు కొత్త ఉప జాతులు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని