Free Tomato: ఆటోలో ప్రయాణిస్తే కిలో టమాటాలు ఉచితం.. కానీ!

చండీగఢ్‌ (Chandigarh)కు చెందిన ఓ ఆటోడ్రైవర్‌ తన ఆటోలో ప్రయాణించే వారికి ఉచితంగా కిలో టమాటాలు అందిస్తున్నాడు. అయితే, ఇందుకు ఒక షరతు విధించాడు.

Updated : 19 Jul 2023 17:10 IST

చండీగఢ్‌: దేశవ్యాప్తంగా టమాటా (Tamota) ధరలు చుక్కలనంటుతున్నాయి. కొన్నిచోట్ల కిలో టమాటా ధర రూ.250 నుంచి రూ.300 వరకు పలుకుతోంది. ఈ క్రమంలో కొందరు వాటి వినియోగాన్నే మానేస్తే.. మరికొందరు ప్రభుత్వం రాయితీ ధరకు అందించే దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. తాజాగా ఓ ఆటోడ్రైవర్‌ తన ఆటోలో ప్రయాణించే వారికి ఉచితంగా కిలో టమాటాలు ఇస్తున్నాడు. అయితే, ఇందుకు అతను ఒక నిబంధన పెట్టాడు. తన ఆటోలో కనీసం ఐదుసార్లు ప్రయాణించిన వారికి మాత్రమే టమాటాలు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపాడు.

పంజాబ్‌ (Punjab)లోని చండీగఢ్‌ (Chandigarh)కు చెందిన అరుణ్‌ గత 12 ఏళ్లుగా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజలకు తన వంతు సాయం చేయాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఉచిత టమాటాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆటో వెనుక బాగంలో అంటించడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ‘‘నాకున్న ఏకైక ఆదాయమార్గం ఆటోనే. దీని ద్వారా ఇలాంటి సేవలు అందించడం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది’’ అని తెలిపాడు. అలాగే, పాకిస్థాన్‌తో త్వరలో జరగబోయే క్రికెట్ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే.. చండీగఢ్‌లో ఐదు రోజులపాటు తన ఆటోలో ఉచిత ప్రయాణం అందిస్తానని వెల్లడించాడు.

టమాటా సాగుతో నెలలోనే రూ.3 కోట్లు..

అరుణ్‌ గతంలో కూడా.. భారత సైన్యం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసి విజయవంతంగా తిరిగి వచ్చిన సందర్భంగా చండీగఢ్‌లో కొద్దిరోజులపాటు ఆటోలో ఉచిత ప్రయాణం అందించాడు. అంతేకాకుండా తన ఆటోలో గర్భిణీలకు, ప్రమాద బాధితులకు ఉచిత ప్రయాణం అందిస్తున్నందుకు చండీగఢ్‌ పోలీసుల నుంచి సత్కారం కూడా అందుకున్నాడు. ఇప్పటికీ తన ఆటోలో భారత సైనికులకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు