Gas Cylinder: తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర

వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎటువంటి మార్పు లేదు.

Updated : 01 Aug 2023 13:09 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను (Commercial LPG cylinder price) చమురు సంస్థలు సవరించాయి. 19 కేజీల ఎల్పీజీ (LPG) సిలిండర్‌ ధరను రూ.99.75 మేర తగ్గించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,680కు దిగొచ్చింది. అయితే గృహ వినియోగ సిలిండర్‌ ధరలో (domestic LPG gas cylinders) మాత్రం ఎటువంటి మార్పూ లేదు. కొత్త ధరలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి.

విమాన ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌ (ATF) ధరలు వరుసగా రెండో సారి పెరిగాయి. దీంతో దేశరాజధాని దిల్లీలో ఈ ధర కిలోలీటరుకు రూ.7,728 పెరిగి, రూ.98,508.26కు చేరింది. ఇక ముంబయిలో కిలో లీటరు ధర రూ.92,124.13గా ఉంది. ఇదిలా ఉండగా దేశీయ చమురు ఉత్పత్తిపై విధించే విండ్‌ఫాల్‌ పన్నులో మాత్రం ఎటువంటి మార్పు తీసుకురాలేదు. పెట్రోల్‌, ఏటీఎఫ్‌లపై విండ్‌ఫాల్‌ పన్నును విధించటం లేదని కేంద్రం తన నోటిఫికేషన్‌లో తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని