
Published : 19 Aug 2021 22:22 IST
DRDO: శత్రు క్షిపణులను బోల్తా కొట్టించే సాంకేతికత ఇది
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన డీఆర్డీవో
దిల్లీ: మన యుద్ధ విమానాలపై దూసుకొచ్చే ప్రత్యర్థుల ‘రాడార్ చోదక క్షిపణుల’ను దారి మళ్లించేలా భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేసింది. ‘అడ్వాన్స్ చాఫ్ మెటీరియల్, చాఫ్ క్యాట్రిడ్జ్- 118/ఐ’ అనే ఈ టెక్నాలజీని స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవోకు చెందిన రెండు ప్రయోగశాలల్లో రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. ఈ సాంకేతికతపై నిర్వహించిన ట్రయల్స్ కూడా విజయవంతమయ్యాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఐఏఎఫ్‌లో దీన్ని ప్రవేశపెట్టే ప్రక్రియ సైతం మొదలైందని తెలిపింది. ఈ విషయమై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం డీఆర్డీవో, వాయుసేనను ప్రశంసించారు. వ్యూహాత్మక రక్షణ సాంకేతికతల అభివృద్ధిలో 'ఆత్మనిర్భర్ భారత్' దిశగా డీఆర్డీవో మరో ముందడుగు వేసిందని కొనియాడారు.
ఇవీ చదవండి
Tags :