
Drone Attack: ఇరాక్ ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి
ఇంటర్నెట్‌డెస్క్: ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కధిమీ డ్రోన్ దాడి నుంచి త్రుటిలో తప్పించుకొన్నారు. ఈ ఘటన బాగ్దాద్‌లోని హైసెక్యూరిటీ జోన్‌లో చోటు చేసుకొంది. పేలుడు పదార్థాలతో ఉన్న డ్రోన్ ఒకటి ఆయన భవనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు అంగరక్షకులు గాయపడ్డారు. ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని ఆయన కోరారు. అమెరికా, ఇరాన్‌లు ఈ దాడిని ఖండించాయి. ఇప్పటి వరకు దాడికి ఎవరూ బాధ్యత స్వీకరించలేదు. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు, విదేశీ దౌత్యవేత్తలు గ్రీన్ జోన్‌లోనే ఉంటారు.
గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యహరించిన కధిమీ ఈ ఏదాడి మేలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో జరిగిన ఎన్నికలకు నిరసనగా ఇరాన్‌కు చెందిన మద్దతు దారులు కొన్ని వారాల క్రితం గ్రీన్ జోన్ వద్ద భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఆ సమయంలో భద్రతా దళాలతో జరిగిన ఘర్షణల్లో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ ఇది పూర్తిగా ఉగ్రచర్యలా కనిపిస్తోందన్నారు. దీనిపై దర్యాప్తునకు అమెరికా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. ఇరాక్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ షంకానీ మాట్లాడుతూ.. ఒక విదేశీ వ్యూహ సంస్థ ప్రోత్సాహంతో జరిగిన దాడిగా అభివర్ణించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Related-stories News
Sonu sood: కుమారుడి చికిత్స కోసం ఓ తల్లి తాపత్రయం.. సోనూసూద్ పేరుతో ఆన్లైన్ మోసం
-
Politics News
Shivsena: శివసేన ముందు ముళ్లబాట!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
LPG: భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర
-
Related-stories News
Andhra News: ప్రొబేషన్ వేళ.. గతేడాది ఆందోళనలో పాల్గొన్న వారి పేర్లతో ‘హిట్ లిస్ట్‌లు’
-
Ap-top-news News
Andhra News: తోతాపురి మామిడా.. మజాకా!.. టన్ను ఎంతో తెలుసా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Income Tax Rules: రేపటి నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..
- Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా శిందే
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..