Eknath Shinde: కొండచరియలు విరిగిపడిన ఘటన.. మానవత్వం చూపిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి..!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde) క్లిష్ట సమయంలో మానవత్వం చూపారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. 

Published : 22 Jul 2023 18:06 IST

ముంబయి: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లా కొండ ప్రాంతమైన ఇర్షల్‌వాడీలో బుధవారం రాత్రి కొండచరియలు(landslide) విరిగిపడిన ఘటనలో భారీ ప్రాణనష్టం సంభవించింది. వీరిలో 80 మందికి పైగా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అలాగే కొండ చరియల కింద ఎంతమంది ఉన్నారన్నదానిపై సరైన స్పష్టత లేదు. కొండ చరియల కారణంగా కూలిన ఇళ్ల శిథిలాల కింద ఎవరైనా చిక్కుకొని ఉంటే.. వారు బతికే అవకాశాలు తక్కువేనని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే(Maharashtra Chief Minister Eknath Shinde) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆయన దత్తత తీసుకోనున్నారని శివసేన పార్టీ వెల్లడించింది. 

‘ఇర్షల్‌వాడీ(Irshalwadi) గ్రామంలో కొండచరియలు విరిగిపడిపోయిన ఘటనలో కొందరు చిన్నారులు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారు. ఆ పిల్లలను దత్తత తీసుకొని వారికి సంరక్షకుడిగా ఉండాలని ఏక్‌నాథ్ శిందే నిర్ణయం తీసుకున్నారు. రెండు నుంచి 14 ఏళ్ల మధ్యలో ఉన్న ఆ చిన్నారులను శ్రీకాంత్‌ శిందే ఫౌండేషన్ కింద ఆశ్రయం పొందుతారని చెప్పారు.  ఆ ఫౌండేషన్ వారికి సంబంధించిన అన్ని ఖర్చులను భరిస్తుంది’ అని శివసేన తెలిపింది. 

మణిపుర్ ఘటన.. అదేరోజు 40 కి.మీ దూరంలో మరో ఘోరం..!

ఇర్షల్‌వాడీలో మొత్తం 48 ఇళ్లు ఉండగా.. కనీసం 17 ఇళ్లు కొండచరియల కారణంగా పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. గ్రామంలో 229 మంది జనాభా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు