Farmers Protest: టియర్‌ గ్యాస్‌ డ్రోన్లకు పతంగులతో చెక్‌

భద్రతా బలగాలు డ్రోన్ల ద్వారా టియర్‌ గ్యాస్‌ ప్రయోగిస్తుండటంతో వాటికి చెక్‌ పెట్టేందుకు రైతులు వినూత్న ఆలోచన చేశారు.

Published : 14 Feb 2024 18:32 IST

దిల్లీ: తమ డిమాండ్ల పరిష్కారం కోసం ‘దిల్లీ చలో’ (Farmers Protest) చేపట్టిన రైతులను హరియాణా శివారు ప్రాంతంలో పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై ఉంచిన కాంక్రీటు దిమ్మెలు, బారికేడ్లు, ఇనుప కంచెలను తొలగించేందుకు ప్రయత్నించిన వారిపై భద్రతా బలగాలు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించాయి. దానికి ప్రతిగా రైతులు రాళ్ల దాడి చేయడంతో శంభు సరిహద్దుల్లోని అంబాలా వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డ్రోన్ల సాయంతో బాష్ప వాయుగోళాలను విడుదల చేస్తుండటంతో వాటికి చెక్ పెట్టేందుకు రైతులు వినూత్న ఆలోచన చేశారు. కొందరు రైతులు డ్రోన్‌ రోటర్లు తిరగకుండా పతంగులను ఎగరేస్తున్నారు. 

రైతు సంఘాలను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రం

మరోవైపు రైతుల ఆందోళ నేపథ్యంలో లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంజాబ్‌-హరియాణా రహదారిపై పెద్ద ఎత్తున ట్రాక్టర్లు నిలపడంతో సరకు రవాణా చేసే ట్రక్‌ డ్రైవర్లు గత మూడు రోజులుగా తమ వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేసినట్లు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పంజాబ్‌లో రైల్‌ రోకో నిర్వహిస్తామని ‘భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఉగ్రహాన్‌’ రైతు సంఘం ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని