పెరిగిన నిరుద్యోగ రేటు

గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు భారత్‌లో నిరుద్యోగుల సంఖ్య స్వల్పంగా పెరిగిందని ముంబయికి చెందిన సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్ ఇండియన్‌ ఎకానమీ (సీఎమ్‌ఐఈ) తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ.....

Published : 02 Mar 2020 23:24 IST

దిల్లీ: దేశంలో నిరుద్యోగ రేటు ఫిబ్రవరిలో 7.78 శాతం మేర పెరిగిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. గతేడాది అక్టోబర్‌ నుంచి చూస్తే ఇది అత్యధికమని పేర్కొంది. ఈ మేరకు ఆ సంస్థ ఫిబ్రవరి నెల గణాంకాలను విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ వ్యాప్తంగా 7.78 శాతం నిరుద్యోగ రేటు నమోదయినట్లు ప్రకటించింది. జనవరి నెలలో 7.16 శాతం నిరుద్యోగ రేటు ఉండగా ఒక నెలలో అది 0.62 శాతం పెరిగిందని వెల్లడించింది. నిరుద్యోగం ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని ప్రతిబింబిస్తోందని ఆ సంస్థ పేర్కొంది. ఆసియాలోనే మూడో అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న భారత్‌ ఆర్థికంపై కరోనా ప్రభావం ఉంటుందని అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని