ఆ ప్రశ్నలు ట్విటర్‌లో అడగొద్దు: రవిశంకర్ 

చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తుంటే, ప్రధాని మోదీ నిశ్శబ్దంగా ఉన్నారంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను బుధవారం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తిప్పికొట్టారు.

Updated : 11 Jun 2020 09:23 IST

రాహుల్‌ గాంధీకి సలహా ఇచ్చిన కేంద్ర మంత్రి 

దిల్లీ: చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తుంటే, ప్రధాని మోదీ నిశ్శబ్దంగా ఉన్నారంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను బుధవారం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తిప్పికొట్టారు. అంతర్జాతీయ అంశాల మీద సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నలు వేయొద్దని సూచించారు. రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ..‘అంతర్జాతీయ అంశాల మీద ట్విటర్‌లో ప్రశ్నలు వేయకూడదని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. ఆయనే గతంలో బాలాకోట్ వైమానిక దాడులు, 2016 ఉరీ దాడులకు ఆధారాలు కావాలని అడిగారు’ అని విమర్శించారు. 

భారత్‌, చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభనపై ఈ రోజు రాహుల్ ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ‘లద్దాఖ్‌లో చైనా మన భూభాగంలోకి చొరబడింది. ప్రధాని మాత్రం ఈ విషయంలో నిశ్శబ్దం వహిస్తూ, ఈ అంశంతో సంబంధం లేనట్లు ఉన్నారు’ అని ట్వీట్ చేశారు. దాంతో పాటు మీడియాలో వచ్చిన వార్తా కథనాన్ని ట్యాగ్ చేశారు. చైనా సరిహద్దులో బలగాలు మోహరించిన దగ్గరి నుంచి ఆయన కేంద్రం మీద పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని