తల్లి జన్మనిస్తే.. వైద్యులతో పునర్జన్మ: మోదీ

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కరోనాపై చేస్తున్న స్ఫూర్తిమంతమైన పోరులో వైద్యులదే కీలక పాత్ర అని కొనియాడారు.......

Published : 01 Jul 2020 12:53 IST

వైద్యుల దినోత్సవం సందర్భంగా వారి సేవల్ని కొనియాడిన ప్రధాని

దిల్లీ: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కరోనాపై చేస్తున్న స్ఫూర్తిమంతమైన పోరులో వైద్యులదే కీలక పాత్రని కొనియాడారు. వారి జీవితాల్ని పణంగా పెట్టి మరీ ఇతరులను కాపాడుతున్నారంటూ వారి సేవల్ని ప్రశంసించారు. ‘తల్లి బిడ్డకు జన్మనిస్తే.. అదే బిడ్డకు వైద్యులు పునర్జన్మని ప్రసాదిస్తారు’ అంటూ వారి ప్రాముఖ్యతను తెలియజేశారు. కరోనాపై యావత్తు దేశం చేస్తున్న పోరులో వైద్యులు ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. 

అలాగే నేడు ‘చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ డే’ నుపురస్కరించుకొని దేశంలోని సీఏలందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ఉజ్వల ఆర్థిక భవిష్యత్తు సీఏల చేతిలోనే ఉందంటూ వారి బాధ్యతను గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని