కరోనాతో ఎంపీ అశోక్‌ గస్తీ మృతి

: రాజ్యసభ సభ్యుడు అశోక్‌ గస్తీ (55) కరోనాతో గురువారం మృతి చెందారు. ఈ నెల 2న తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యతో బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆయనకు కొవిడ్‌-19 పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలింది. న్యుమోనియా సమస్యతోపాటు బహుళ అవయవాలు దెబ్బతినటంతో పది రోజులు

Published : 18 Sep 2020 09:33 IST

జులై 22న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం..

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: రాజ్యసభ సభ్యుడు అశోక్‌ గస్తీ (55) కరోనాతో గురువారం మృతి చెందారు. ఈ నెల 2న తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యతో బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆయనకు కొవిడ్‌-19 పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలింది. న్యుమోనియా సమస్యతోపాటు బహుళ అవయవాలు దెబ్బతినటంతో పది రోజులు ఐసీయూలోనే జీవ సహాయ వ్యవస్థలతో చికిత్సలు అందించినట్లు ఆస్పత్రి సంచాలకుడు మనీష్‌ రై తెలిపారు. చికిత్స ఫలించక రాత్రి 10:31 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకటన చేయకముందే మృతి చెందినట్లు మాధ్యమాలు ప్రసారం చేశాయి. దీంతో రాష్ట్రపతి మొదలు కేంద్ర మంత్రులంతా సంతాపాన్ని ప్రకటించారు. కానీ ఆయన రాత్రి తుదిశ్వాస విడిచారు. రాయచూరు జిల్లాకు చెందిన అశోక్‌ గస్తీ జులై 22న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసి పార్లమెంట్‌లో అడుగుపెట్టకుండానే మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని