
Updated : 03 Nov 2021 19:06 IST
China: జిన్‌పింగ్ ప్రసంగానికి వీడియో అనుసంధానం కల్పించలేదు: చైనా
బీజింగ్: ప్రపంచ వాతావరణ సదస్సు(కాప్26) నిర్వాహకులపై చైనా ఆగ్రహం వ్యక్తంచేసింది. వారు వీడియో అనుసంధానం కల్పించకపోవడం వల్లే సదస్సును ఉద్దేశించి తమ అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ప్రసంగించలేకపోయారని పేర్కొంది. వాతావరణ సంబంధ అంశాలపై తమ దేశ వైఖరిని ప్రకటన రూపంలో విడుదల చేయాల్సి వచ్చిందని తెలిపింది. జిన్‌పింగ్ కాప్26 సదస్సులో ప్రసంగించడానికి బదులుగా ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ ఈ విధంగా స్పందించారు. కర్బన ఉద్గారాల కట్టడిలో తమ దేశం తరఫున గట్టి హామీ ఇవ్వకుండా తప్పించుకునే యత్నాల్లో భాగంగానే జిన్‌పింగ్ వాతావరణ సదస్సుకు రాలేదనే అనుమానాలు రేకెత్తాయి.
Tags :