Anthony fauci: అసాధారణ సాంక్రమిక శక్తితో ఒమిక్రాన్‌: ఫౌచీ

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి ప్రపంచమంతటా ఇప్పుడిప్పుడే పెరుగుతోందని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల 

Published : 20 Dec 2021 09:26 IST

విల్మింగ్టన్‌: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి ప్రపంచమంతటా ఇప్పుడిప్పుడే పెరుగుతోందని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ తెలిపారు. అమెరికాలో వ్యాక్సిన్‌ తీసుకోనివారికి శీతాకాలంలో పరిస్థితి ఎలా ఉండబోతుందన్న విషయమై హెచ్చరించడానికి అధ్యక్షుడు జో బైడెన్‌ యోచిస్తున్నట్లు చెప్పారు. ఓ వార్తాసంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఫౌచీ ఆదివారం మాట్లాడారు. అమెరికాలో అర్హులైన ఎంతోమంది ఇంతవరకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోకపోవడమే అసలు సమస్యగా పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ పూర్తయినవారు కూడా విమానాశ్రయాలు వంటి రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరిస్తూ ఉండాలని సూచించారు. ఒమిక్రాన్‌కు అసాధారణ రీతిలో సాంక్రమిక శక్తి ఉందన్నది నిస్సందేహమని ఫౌచీ స్పష్టం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని