Imran khan: డబ్బు కోసమే అమెరికాతో చేతులు కలిపాం: ఇమ్రాన్‌

అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదంపై అమెరికా 20 ఏళ్ల పాటు జరిపిన పోరాటంలో పాకిస్థాన్‌ పాలు పంచుకోవడంపై ...

Published : 22 Dec 2021 10:52 IST

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదంపై అమెరికా 20 ఏళ్ల పాటు జరిపిన పోరాటంలో పాకిస్థాన్‌ పాలుపంచుకోవడంపై ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా.. కేవలం డబ్బు కోసమే అమెరికాతో తమ దేశం అప్పట్లో చేతులు కలిపిందని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో మంగళవారం విదేశాంగ శాఖ అధికారుల సమావేశంలో ఇమ్రాన్‌ ప్రసంగించారు. అఫ్గాన్‌ విషయంలో అమెరికాతో కలిసి ముందుకెళ్లాలని 2001లో నిర్ణయం తీసుకున్నవారితో ఆ రోజుల్లో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని ఆయన తెలిపారు. కాబట్టి నాటి పరిస్థితులపై తనకు పూర్తిస్థాయి అవగాహన ఉందన్నారు. ‘‘ఇతరులు మనల్ని వాడుకునేందుకు నాడు మనమే అవకాశమిచ్చాం. దేశ ప్రతిష్ఠను పణంగా పెట్టాం. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా, డబ్బు కోసం విదేశాంగ విధానాన్ని రూపొందించాం. అది (అఫ్గాన్‌లో పోరాటం) మనకు మనమే చేసుకున్న గాయం. దీనిపై ఇతరులెవర్నీ నిందించలేం’’ అని ఇమ్రాన్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు