Covid Vaccine: టీకా తీసుకోమన్నందుకు చెయ్యి విరగ్గొట్టాడు

కరోనా టీకా తీసుకోవడానికి ససేమిరా అన్న ఓ వ్యక్తి.. అతణ్ని ఒప్పించడానికి యత్నించిన పోలీస్‌ అధికారితో గొడవపడి చెయ్యి

Updated : 27 Dec 2021 10:13 IST

పోలీస్‌ అధికారిపై గ్రామస్థుడి దాడి 
ఝార్ఖండ్‌లో ఘటన 

గిరిధ్‌: కరోనా టీకా తీసుకోవడానికి ససేమిరా అన్న ఓ వ్యక్తి.. అతణ్ని ఒప్పించడానికి యత్నించిన పోలీస్‌ అధికారితో గొడవపడి చెయ్యి విరగ్గొట్టాడు. ఝార్ఖండ్‌లోని గిరిధ్‌ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అక్కడి మహువర్‌ గ్రామ ప్రజలను టీకాలు తీసుకునేలా ప్రోత్సహించడానికి అధికారులు వచ్చారు. వారితోపాటు పోలీస్‌ అధికారి కృష్ణ కుమార్‌ మరాండి కూడా ఉన్నారు. అయితే రామచంద్ర ఠాకుర్‌ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు టీకా తీసుకోమని చెప్పారు. వారికి వ్యాక్సిన్‌ ప్రయోజనాల గురించి చెప్పి ఒప్పించడానికి కృష్ణ కుమార్‌ యత్నించారు. ఈక్రమంలో ఆయనపై ఆగ్రహానికి గురైన ఠాకుర్‌ కర్రతో దాడి చేయగా చెయ్యి విరిగింది. వెంటనే ఠాకుర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. కృష్ణ కుమార్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఠాకుర్‌ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు