నిమోనియా తగ్గాలని.. మూణ్నెల్ల పాపకు 51 వాతలు
మూఢనమ్మకం మూడు నెలల పసికందు ప్రాణం తీసింది. పాపకు సోకిన నిమోనియా తగ్గాలని ఆ లేత శరీరంపై 51 సార్లు కాల్చిన ఇనుపరాడ్డుతో వాతలు పెట్టారు.
తల్లిదండ్రుల మూఢనమ్మకం మూడు నెలల పసికందు ప్రాణం తీసింది. పాపకు సోకిన నిమోనియా తగ్గాలని ఆ లేత శరీరంపై 51 సార్లు కాల్చిన ఇనుపరాడ్డుతో వాతలు పెట్టారు. పాపం.. ఆ చిన్నారి పదిహేను రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న షాదోల్ జిల్లాలో జరిగింది. సింగ్‌పుర్ కథౌటియా గ్రామానికి చెందిన చిన్నారి రుచితా కోల్ నిమోనియా బారినపడింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఆమె తల్లిదండ్రులు స్థానికంగా ఉండే మంత్రగాళ్లకు చూపించారు. అక్కడ చిన్నారి పొట్టపై 51 సార్లు వాతలు పెట్టారు. ఓవైపు కాలిన గాయాలు.. మరోవైపు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో పాప పరిస్థితి మరింత దిగజారాక స్థానిక ఆసుపత్రికి పరుగులు తీశారు. అప్పటికే 15 రోజులు గడిచిపోవడంతో ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటనపై షాదోల్ జిల్లా కలెక్టర్ వందనా వైద్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో నిమోనియాకు ఇలాంటి చర్యలు సర్వసాధారణం అయ్యాయని, వీటిని కట్టడి చేస్తామన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rajasthan: ‘గహ్లోత్జీ వారి మొర ఆలకించండి’.. ప్రైవేట్ వైద్యులకు సచిన్ పైలట్ మద్దతు!
-
Viral-videos News
Viral Video: చెన్నై అమ్మాయిల సరదా పని..! బకెట్లు.. డబ్బాలు.. కుక్కర్లతో కాలేజీకి..
-
Sports News
IND vs PAK: వన్డే ప్రపంచ కప్ 2023.. భారత్లో ఆడేది లేదన్న పాక్.. తటస్థ వేదికల్లోనే నిర్వహించాలట!
-
World News
Espionage: రష్యాలో అమెరికన్ జర్నలిస్టు అరెస్టు.. ప్రచ్ఛన్న యుద్ధానంతరం మొదటిసారి!
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి
-
Sports News
IPL 2023: ‘ఈ సీజన్లో ఛాంపియన్గా నిలిచేది ఆ జట్టే’.. ముంబయి, చెన్నైలకు నో ఛాన్స్!