చంద్రునిపై ల్యాండర్‌, రోవర్‌ నుంచి అందని సంకేతాలు

విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ను మేల్కొలిపి తిరిగి వాటితో సంకేతాలు పునరుద్ధరించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Published : 24 Sep 2023 05:59 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ను మేల్కొలిపి తిరిగి వాటితో సంకేతాలు పునరుద్ధరించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చంద్రునిపై విజయవంతంగా ప్రయోగ పరీక్షలు నిర్వహించాక ఈ నెల 2న రోవర్‌, 4న ల్యాండర్‌ను నిద్రాణస్థితికి పంపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రోవర్‌లోని ఏపీఎక్స్‌ఎస్‌, ఎల్‌ఐబీఎస్‌ పేలోడ్‌లను ఆపివేశారు. వీటి నుంచే డేటా ల్యాండర్‌ ద్వారా భూమికి ప్రసారం అవుతుంది. ప్రస్తుతం శివశక్తి పాయింట్‌ వద్ద సూర్యోదయం కావడంతో ల్యాండర్‌, రోవర్‌ బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్‌ చేసి శుక్రవారం నుంచి వాటితో సంకేతాలను పునరుద్ధరించడానికి ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. 2019లో చైనాకు చెందిన ల్యాండర్‌ చాంగ్‌-4, రోవర్‌ యుటు-2లను తెల్లవారుజామున మేల్కొలిపినట్లు నిపుణులు ప్రస్తావిస్తున్నా.. దక్షిణ ధ్రువం వద్ద పరిస్థితులు వేరని, రాత్రి సమయంలో అక్కడి ఉష్ణోగ్రత -250 డిగ్రీల సెల్సియస్‌కు వరకు పడిపోయింనందున మేల్కొలుపుపై ఆశలు తక్కువగా ఉన్నాయని, వాటి బ్యాటరీల సామర్థ్యం అందుకు సరిపోదని ఇస్రోకు చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త ‘న్యూస్‌టుడే’తో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని