నీటమునిగిన నాగ్‌పుర్‌

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ నగరం శనివారం కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైంది. వీధులన్నీ నదులను తలపించాయి. నివాస ప్రాంతాలను వరద చుట్టుముట్టింది.

Published : 24 Sep 2023 05:36 IST

రెండు గంటల వ్యవధిలో 9 సెం.మీ. వర్షపాతం
ఓ వృద్ధురాలి మృతి

నాగ్‌పుర్‌: మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ నగరం శనివారం కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైంది. వీధులన్నీ నదులను తలపించాయి. నివాస ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. లోతట్టులో ఉన్న ఇళ్లలోకి నీరు చేరింది. ఓ వృద్ధురాలు మృత్యువాత పడ్డారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నాగ్‌పుర్‌ కలెక్టర్‌తో మాట్లాడి, అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ‘‘శనివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్య 9 సెం.మీ. వర్షం కురవడంతో అంబజారి సరస్సు పొంగిపొర్లింది. ఆ నీళ్లన్నీ పల్లపు ప్రాంతాలను చుట్టుముట్టాయి.ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వారిలో ఓ ప్రత్యేక పాఠశాలకు చెందిన 70 మంది బధిర విద్యార్థులు ఉన్నారు’’ అని ఉప ముఖ్యమంత్రి ఫడణవీస్‌ ట్విటర్‌లో తెలిపారు. వాతావరణ శాఖ నాగ్‌పుర్‌, భందార, గోండియా జిల్లాలకు రానున్న 24 గంటల వరకు ఆరెంజ్‌ హెచ్చరికను జారీ చేసింది. దీంతో స్థానిక యంత్రాంగం పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని