గణతంత్ర కవాతుకు భారీ బందోబస్తు

75వ గణతంత్ర దినోత్సవ వేళ.. దేశ రాజధాని దిల్లీని భద్రతా సిబ్బంది తమ గుప్పిట్లోకి తీసుకుంది.

Published : 25 Jan 2024 04:40 IST

దిల్లీ: 75వ గణతంత్ర దినోత్సవ వేళ.. దేశ రాజధాని దిల్లీని భద్రతా సిబ్బంది తమ గుప్పిట్లోకి తీసుకుంది. ముఖ్యంగా కవాతు జరిగే కర్తవ్యపథ్‌ ప్రాంతంలో భారీ స్థాయిలో రక్షణ సిబ్బందిని మోహరించనుంది. మొత్తం ఈ ప్రాంతాన్ని 14 వేల మంది భద్రతా సిబ్బంది కాపలా కాయనున్నట్లు బుధవారం దిల్లీ పోలీసులు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లు జరగకుండా అత్యాధునిక పరికరాలతో డేగ కన్ను వేసింది. గణతంత్ర దినోత్సవం ముందు రోజైన గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.  గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ నేరుగా రాజస్థాన్‌లోని జైపుర్‌లో గురువారం దిగనున్నారు. ఆరు గంటలసేపు ఆ నగరంలోనే ఆయన గడపనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా జైపుర్‌ వచ్చి మెక్రాన్‌ను కలుసుకుంటారు. సాయంత్రం వీరిద్దరు రోడ్‌ షోలో పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని