దుస్తుల్లేని చిన్ననాటి ఫొటోపై అభ్యంతరం.. అకౌంట్‌ను నిలిపివేసిన గూగుల్‌

చిన్నప్పటి ఫొటోను డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేసిన వ్యక్తికి గూగుల్‌ షాకిచ్చింది. అతడి అకౌంట్‌ను నిలిపివేసింది. దీనిపై ఏడాదిగా గూగుల్‌తో పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో బాధితుడు గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు.

Updated : 19 Mar 2024 05:49 IST

సెర్చ్‌ఇంజిన్‌కు హైకోర్టు నోటీసులు

అహ్మదాబాద్‌: చిన్నప్పటి ఫొటోను డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేసిన వ్యక్తికి గూగుల్‌ షాకిచ్చింది. అతడి అకౌంట్‌ను నిలిపివేసింది. దీనిపై ఏడాదిగా గూగుల్‌తో పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో బాధితుడు గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. సెర్చ్‌ఇంజిన్‌ దిగ్గజ సంస్థతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

గుజరాత్‌కు చెందిన కంప్యూటర్‌ ఇంజినీర్‌ నీల్‌ శుక్లా చిన్నప్పటి జ్ఞాపకాలను పదిలపర్చుకోవడంలో భాగంగా కొన్ని ఫొటోలను గతేడాది ఏప్రిల్‌లో గూగుల్‌ డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేశారు. రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు తనకు నానమ్మ స్నానం చేయిస్తున్న ఫొటో కూడా అందులో ఉంది. ఫొటోలో దుస్తుల్లేకుండా ఉండడం ‘చైల్డ్‌ అబ్యూజ్‌’ కిందకు వస్తుందంటూ అతడి ఖాతాను గూగుల్‌ బ్లాక్‌ చేసింది. దీనిపై వివరణ ఇస్తూ ఖాతాను పునరుద్ధరించాలని గూగుల్‌ను పదే పదే అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. ఏడాదిగా ఖాతా నిలిచిపోవడం వల్ల ఈమెయిల్‌ అకౌంట్‌ను వినియోగించలేకపోతున్నానని, తద్వారా తన వ్యాపారానికి నష్టం వాటిల్లిందని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో శుక్లా వివరించారు. ఈ వివాదంపై మార్చి 26లోగా సమాధానం ఇవ్వాలంటూ గూగుల్‌తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని