బెయిల్‌ కోసం విచారణ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?

తన అరెస్టు, కస్టడీని సవాల్‌ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ కేసులో బెయిల్‌ కోసం విచారణ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారా? అని సీఎం తరఫున న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీని ధర్మాసనం ప్రశ్నించింది.

Published : 30 Apr 2024 04:53 IST

కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన సుప్రీం కోర్టు

దిల్లీ: తన అరెస్టు, కస్టడీని సవాల్‌ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ కేసులో బెయిల్‌ కోసం విచారణ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారా? అని సీఎం తరఫున న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే, ఈ కేసులో కేజ్రీవాల్‌ అరెస్టు అక్రమమని, అందుకే తాము ఎలాంటి పిటిషన్లు వేయలేదని న్యాయవాది తెలిపారు.  కేవలం సమన్లకు హాజరుకాలేదన్న కారణంతో అరెస్టు చేయడం సరికాదని వాదించారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ప్రస్తుతం కేజ్రీవాల్‌ జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని