జాఫ్నా-నాగపట్నం మధ్య 13 నుంచి ప్రయాణికుల నౌకలు

భారత్‌-శ్రీలంక మధ్య ప్రయాణికుల నౌకల రాకపోకలు ఈ నెల 13 నుంచి పునఃప్రారంభం కానున్నాయి.

Published : 07 May 2024 04:13 IST

కొలంబో: భారత్‌-శ్రీలంక మధ్య ప్రయాణికుల నౌకల రాకపోకలు ఈ నెల 13 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. తమిళనాడులోని నాగపట్నం నుంచి శ్రీలంక ఉత్తర ప్రావిన్సులోని జాఫ్నా జిల్లాలో ఉన్న కంకేసంతురాయ్‌ పట్టణానికి ఇవి రాకపోకలు చేస్తాయి. రెండింటి మధ్య దూరం 111 కిలోమీటర్లు (60 నాటికల్‌ మైళ్లు). నౌకలో ప్రయాణ సమయం మూడున్నర గంటలు. శ్రీలంక ప్రభుత్వంతో సంప్రదించిన మీదట ‘షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ ఒక ప్రైవేటు ఆపరేటర్‌ను ఫెర్రీ సర్వీసు కోసం ఎంపిక చేసింది. 40 ఏళ్ల విరామం తర్వాత గత ఏడాది అక్టోబరులోనే నౌకల సేవలు అందుబాటులోకి వచ్చినా ప్రతికూల వాతావరణం వల్ల కొన్నిరోజుల తర్వాత నిలిపివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని