Giant wheel: వామ్మో.. సరదాగా జెయింట్‌ వీల్‌ ఎక్కితే నరకం కనిపించింది!

సరదాగా జెయింట్‌ వీల్‌ ఎక్కిన ఓ బాలికకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఆమె జుట్టు అందులో ఇరుక్కుపోయింది.

Updated : 29 Sep 2023 17:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జెయింట్‌ వీల్‌ ఎక్కి ఎంజాయ్‌ చేద్దామనుకున్న ఓ బాలికకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. గణేష్‌ ఉత్సవాల్లో భాగంగా ఓ మండపం వద్ద భారీ జెయింట్‌ వీల్‌ను ఏర్పాటు చేశారు. ఓ బాలిక కాసేపు సరదాగా గడిపేందుకు అందరితోపాటు జెయింట్‌ వీల్‌ ఎక్కింది. రెండు రౌండ్లు తిరిగిందో లేదో.. ఆమె కూర్చున్న తొట్టెకు, జెయింట్‌ వీల్‌కు మధ్య తన జుట్టు ఇరుక్కుపోయింది. దాంతో బాలిక నొప్పితో విలవిల్లాడిపోతూ బిగ్గరగా అరవడం మొదలు పెట్టింది. అది గుర్తించిన జెయింట్‌ వీల్‌ ఆపరేటర్ వెంటనే ఇంజిన్‌ను ఆపేశాడు. అతడు బాలికను రక్షించే ప్రయత్నం చేసి.. చివరికి చాకుతో జుట్టును కత్తిరించేశాడు. ఈ ఘటన గుజరాత్‌లో జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని