High Speed Train: ఆరు నెలల్లో హైస్పీడ్ ట్రైన్.. వెల్లడించిన రైల్వే మంత్రి
ఆరునెలల్లో దేశంలో తొలి హైస్పీడ్ ట్రైన్(High Speed Train) రానుంది. ఈ విషయాన్ని శనివారం రైల్వే మంత్రి వెల్లడించారు.
(ప్రతీకాత్మక చిత్రం)
సనంద్: వచ్చే ఆరునెలల్లో దేశంలో తొలి హైస్పీడ్ ట్రైన్(High Speed Train) అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్- సనంద్ (Ahmedabad to Sanand) మధ్య ఇది నడుస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని సనంద్‌లో సెమీకండక్టర్ కంపెనీ మైక్రాన్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఆ స్టేషన్లో వందే భారత్ రైళ్లు కూడా ఆగుతాయని చెప్పారు.
‘అహ్మదాబాద్-సనంద్ మధ్య ప్రపంచ స్థాయి రైలు ప్రారంభం కానుంది. వచ్చే ఆరునెలల్లో హైస్పీడ్ ట్రైన్ రానుంది’ అని రైల్వే మంత్రి తెలిపారు. అలాగే రానున్న సంవత్సరాల్లో సెమీ కండక్టర్ల డిమాండ్ ఐదు లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుందన్నారు. ఈ రంగంలో గుజరాత్ ముందువరుసలో నిలిచిందన్నారు. సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ప్లాంట్‌ను గుజరాత్లో ఏర్పాటు చేస్తామని మైక్రాన్ సంస్థ ఈ జూన్‌లో ప్రకటించింది. ఇందుకోసం ఈ అమెరికన్ కంపెనీ రూ.22,140 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది.
కాచిగూడ- యశ్వంత్‌పూర్, చెన్నై- విజయవాడ టికెట్ ధరలివే..!
ముంబయి నుంచి అహ్మదాబాద్ మధ్య చేపడుతున్న బుల్లెట్ రైలు కారిడార్ మొత్తం పొడవు 508.17 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అహ్మదాబాద్ నుంచి ముంబయి కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. జపాన్ సహకారంతో భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపడుతోంది. అయితే, మహారాష్ట్రలో భూసేకరణ ఆలస్యం కావడం వల్ల ప్రాజెక్ట్ పనులు నెమ్మదించాయి. ఈ క్రమంలో తొలుత అహ్మదాబాద్-సనంద్ మధ్య దీన్ని నడపనున్నారు. 2026లో ముంబయి- అహ్మదాబాద్ మధ్య పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా వీటిని ప్రారంభించనున్నారు. దీంతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య 34కు చేరనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Amit Shah: సీఏఏ అమలును ఎవ్వరూ ఆపలేరు : అమిత్ షా
పౌరసత్వ (సవరణ) చట్టం అమలును ఎవ్వరూ అడ్డుకోలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) మరోసారి స్పష్టం చేశారు. -
Amit shah: చారిత్రక మైలు రాయి.. కేంద్రంతో యూఎన్ఎల్ఎఫ్ శాంతి ఒప్పందం
మణిపుర్లో సాయుధ గ్రూపు యూఎన్ఎల్ఎఫ్ కేంద్రంతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. -
Supreme Court: ఆప్ సర్కారుకు ఎదురుదెబ్బ.. దిల్లీ సీఎస్ పదవీకాలం పొడిగింపు
Supreme Court: దిల్లీ సీఎస్ (Delhi CS) పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కేంద్రం నిర్ణయం చట్టపరమైనదే అని పేర్కొంది. -
Anju: ఆ అంజూ భారత్‌కు తిరిగి వచ్చింది..!
ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్ వెళ్లి, అక్కడే అతడిని పెళ్లి చేసుకున్న అంజూ(Anju) అనే మహిళ.. తిరిగి భారత్ వచ్చినట్లు సమాచారం. -
Rahul gandhi: చిరిగిన బూట్లు వేసుకున్నా.. వాళ్లంతా సంపన్న నేతలే: రాహుల్
కొందరు నాయకులు తాము సాధారణ జీవితం గడుపుతునట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆ నాయకులు తమ పిల్లల విషయంలో దీన్ని అమలు చేయలేరన్నారు. -
Uttarakhand tunnel: సొరంగం ఆపరేషన్‌ను లైవ్‌లో చూసి.. మోదీ భావోద్వేగం
Uttarakhand tunnel: ఉత్తరాఖండ్‌లో సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు నిన్న రాత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన ప్రధాని మోదీ.. భావోద్వేగానికి గురయ్యారట..! -
సొరంగంలోని బిడ్డకోసం 16 రోజులు నిరీక్షించి.. బయటకొచ్చే కొద్ది గంటల ముందే..!
Uttarkashi tunnel: కన్నబిడ్డ టన్నెల్లో చిక్కుకుపోయాడని తెలుసుకున్న ఆ తండ్రి తీవ్ర ఆందోళన చెందాడు. బిడ్డ రాకకోసం ఎదురుచూసి.. అతడు రావడానికి కొద్ది గంటల ముందే తుదిశ్వాస విడిచాడు. -
Flight: భార్యాభర్తల గొడవతో.. విమానం దారి మళ్లింది..!
లుఫ్తాన్సా విమానం(Plane)లో ఓ జంట అభ్యంతరకరంగా ప్రవర్తించి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించింది. వారి వల్ల బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానం దిల్లీలో దిగాల్సి వచ్చింది. -
Cabinet Meet: డ్వాక్రా మహిళలకు డ్రోన్లు.. మరో ఐదేళ్లు ఉచిత రేషన్: కేబినెట్ కీలక నిర్ణయాలు
Cabinet Meet: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్వాక్రా మహిళలకు డ్రోన్లను ఇచ్చే పథకంతో పాటు.. ఉచిత రేషన్ పొడిగింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
Respiratory Infections: చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కలకలం.. భారత్‌లో 6 రాష్ట్రాలు అలర్ట్..!
Respiratory Infections: చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి నేపథ్యంలో.. ప్రజారోగ్య సంరక్షణ, ఆసుపత్రుల సంసిద్ధతపై తక్షణమే సమీక్ష జరపాలని ఇటీవల భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. -
Uttarakhand Tunnel: ముందే చెప్పా.. ఆ 41 మంది బయటకు వస్తారని..!: ఆర్నాల్డ్ డిక్స్
Uttarakhand Tunnel: ఆస్ట్రేలియా పౌరుడైన ఆర్నాల్డ్ డిక్స్(Arnold Dix).. ఉత్తరాఖండ్ టన్నెల్ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. -
Anand Mahindra: సమష్టి కృషితో ఏదైనా సాధ్యమే.. కార్మికుల రాకపై ఆనంద్ మహీంద్రా ట్వీట్
దాదాపు 17 రోజులుగా సొరంగంలో చిక్కుపోయిన కార్మికులను సహాయక బృందాలు ఎట్టకేలకు సురక్షింతంగా బయటకు తీసుకువచ్చాయి. దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. -
Uttarakhand Tunnel: తొలుత భయపడ్డాం.. కానీ, నమ్మకాన్ని వీడలేదు: మోదీతో కార్మికుల సంభాషణ
Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్‌లో సొరంగం నుంచి బయటపడిన కూలీలు ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఈ ప్రభుత్వం తమను కాపాడుతుందనే నమ్మకంతో తాము ధీమాగా ఉన్నామని ప్రధానికి వారు తెలిపారు. -
అడ్డంకులు అధిగమించి.. ఉత్కంఠకు తెరదించి!
ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ మార్గంలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగం పాక్షికంగా కూలిపోవడంతో దాని లోపల చిక్కుకుపోయిన 41 మంది కూలీలు. వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్వో, ఐటీబీపీ తదితర బలగాలు. -
ఆ మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించండి
మణిపుర్‌లోని మార్చురీలలో భద్రపరిచి ఉన్న మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన తొమ్మిది స్థలాల్లో ఎక్కడైనా సరే మృతుల ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఆ క్రతువును నిర్వహించాలని మంగళవారం స్పష్టం చేసింది. -
ఆ పోస్టుకు మరో ఐఏఎస్ అధికారి లేరా?
మరో ఆరు నెలల పాటు దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా నరేశ్ కుమార్‌ను కొనసాగించాలని భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేయడంతో సుప్రీంకోర్టు మంగళవారం కీలక ప్రశ్నలను సంధించింది. -
సామాజిక మాధ్యమాల్లోని సమాచారంతో పిల్
సామాజిక మాధ్యమాల నుంచి సేకరించిన సమాచారంతో ఓ న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడాన్ని బాంబే హైకోర్టు తప్పుబట్టింది. అలాంటి గణాంకాలతో వాదనలు వినిపించడం సరికాదని హితవు పలికింది. -
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు తెలపాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. వివాహ బంధంలో కొనసాగుతున్నా, విడిపోయినా భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేందుకు అవకాశం లేదని జస్టిస్ ఎస్.సునీల్‌దత్ యాదవ్, జస్టిస్ విజయకుమార్ ఏ పాటిల్‌లతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. -
మమ్మల్ని వేరే కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు పంపండి
మణిపుర్లో ఘర్షణల నేపథ్యంలో తమకు దేశంలోని ఇతర కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వెసులుబాటు కల్పించాలంటూ మణిపుర్ విశ్వవిద్యాలయానికి చెందిన 284 మంది విద్యార్థులు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వే.. నివేదిక సమర్పణకు గడువు కోరిన ఏఎస్ఐ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథుని ఆలయం పక్కన గల జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జరిపిన శాస్త్రీయ సర్వే నివేదిక సమర్పణకు మరో మూడు వారాల వ్యవధి కావాలని భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) మంగళవారం జిల్లా కోర్టును కోరింది. -
వృత్తలేఖినితో దాడి కేసు జువైనల్ జస్టిస్ బోర్డుకు
మధ్యప్రదేశ్‌లో ఇందౌర్‌లో తమ తోటి విద్యార్థిని మరో ముగ్గురు విద్యార్థులు వృత్తలేఖిని (జామెట్రీ కంపాస్)తో పొడిచిన కేసును జువైనల్ జస్టిస్ బోర్డుకు అప్పగించాలని ఇందౌర్ పోలీసులు నిర్ణయించారు.


తాజా వార్తలు (Latest News)
-
Ts Elections: మాకు డబ్బులివ్వరా?.. మిర్యాలగూడలో మహిళా ఓటర్ల ఆందోళన
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Amit Shah: సీఏఏ అమలును ఎవ్వరూ ఆపలేరు : అమిత్ షా
-
cybercrime: ఐటీ ఉద్యోగికి సైబర్ మోసగాళ్ల వల.. రూ.3.5 కోట్లకు టోకరా!
-
China: ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ.. చైనా కఠిన నిర్ణయం..!
-
Hyderabad: ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు