Traffic Rules: పోలీసులే ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించారా.. డబుల్‌ ఫైన్‌!

రోడ్డు నిబంధనలు ఉల్లంఘించే పోలీసుల నుంచి రెట్టింపు జరిమానా వసూలు చేయనున్నారు. రాజస్థాన్‌ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Published : 12 Apr 2023 01:19 IST

జైపుర్‌: రోడ్డు నిబంధనలు (Traffic Rules) ఉల్లంఘించే సాధారణ ప్రయాణికులపై ట్రాఫిక్‌ సిబ్బంది కఠిన చర్యలు తీసుకోవడం తెలిసిందే. పెద్ద మొత్తంలో జరిమానాలు (Fine) వసూలు చేస్తుంటారు. మరి.. ట్రాఫిక్స్‌ రూల్స్‌ పాటించాలని ప్రజలకు చెప్పాల్సిన పోలీసులే (Police) వాటిని అతిక్రమిస్తే..? ఇలాంటి ఉల్లంఘనలను కట్టడి చేసేందుకు రాజస్థాన్‌ (Rajasthan) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్రాఫిక్ నిబంధనలను పాటించని పోలీసులకు రెట్టింపు జరిమానా విధించనుంది. దీంతోపాటు వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

రాజస్థాన్‌ డీజీపీ ఉమేశ్‌ మిశ్రా ఆదేశాల మేరకు ఏడీజీపీ (ట్రాఫిక్) వీకే సింగ్ మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. శిరస్త్రాణం ధరించకపోవడం, ద్విచక్ర వాహనంపై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించడం, కారు నడుపుతున్నప్పుడు సీటు బెల్టు పెట్టుకోకపోవడం, సిగ్నల్‌ జంపింగ్‌, మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడపడం తదితర అతిక్రమణల విషయంలో పోలీసులు.. సాధారణ జరిమానా కంటే రెట్టింపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా సంబంధిత పోలీసులపై శాఖాపరమైన చర్యలూ తీసుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని