Digital India: ఆన్‌లైన్‌ వ్యవస్థతో ‘క్యూ లైన్‌’ అనే మాటే లేకుండా చేశాం: మోదీ

దేశ ప్రజల జీవితాల్లో డిజిటల్‌ టెక్నాలజీ (Digital Technology) ఎంతో మార్పు తెచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.

Published : 04 Jul 2022 22:25 IST

దిల్లీ: దేశ ప్రజల జీవితాల్లో డిజిటల్‌ టెక్నాలజీ (Digital Technology) ఎంతో మార్పు తెచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భిన్న రకాల సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవడం వల్ల క్యూలైన్‌ (Queue)లను పూర్తిగా నిర్మూలించామని అన్నారు. కాలం మారుతున్నా కొద్ది భారత్‌ నూతన సాంకేతికతను అలవరచుకోలేకపోతే దేశం ఇంకా వెనుకబడే ఉండేదని అన్నారు. గుజరాత్‌లో ఏర్పాటు చేసిన ‘డిజిటల్‌ ఇండియా వీక్‌-2022’ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోదీ.. మూడో పారిశ్రామిక విప్లవాన్ని భారత్‌ చూస్తోందని అన్నారు.

‘ఎనిమిది, పదేళ్ల క్రితం ప్రతి పనికీ క్యూ లైన్లో నిలబడాల్సి వచ్చేది. జనన ధ్రువీకరణ, రేషన్‌, అడ్మిషన్లు, పరీక్షా ఫలితాలు, ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకుల వద్ద భారీగా క్యూ లైన్లలో వేచి ఉండేవాళ్లం. ఆన్‌లైన్‌ వ్యవస్థ వచ్చిన తర్వాత అటువంటి లైన్లు అన్నింటినీ భారత్‌ పూర్తిగా నిర్మూలించింది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డిజిటల్‌ ఇండియా (Digital India) కార్యక్రమం దేశంలోని పేద ప్రజలందరికీ ఎంతో ఉపశమనం కలిగించిందన్నారు. ముఖ్యంగా అవినీతి, అన్ని రంగాల్లో మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నిర్మూలించగలిగామని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని