Indian Navy: విక్రాంత్‌ ట్రయల్స్‌ విజయవంతం

భారత్‌ తొలిసారి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ విమాన వాహక నౌక

Published : 08 Aug 2021 23:55 IST

దిల్లీ: భారత్‌ తొలిసారి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ విమాన వాహక నౌక (ఐఏసీ) విక్రాంత్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసుకొని ఒడ్డుకు చేరుకుంది. ఈ విషయాన్ని ఇండియన్‌ నేవీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. భారత నావికాదళంలో చేర్చడానికి ముందు దీని పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి సముద్ర జలాల్లో ట్రయల్స్‌ నిర్వహించామని ఇందులో పేర్కొంది.

దీని ప్రత్యేకతలు..

ఈ వాహన నౌక 40 వేల టన్నుల బరువుంటుంది. దీన్ని సుమారు రూ.23 వేల కోట్ల ఖర్చుతో కొచ్చి షిప్‌యార్డ్‌ నిర్మించింది. దాదాపు 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు, 59 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇందులో 2,300 కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి. దాదాపు 1700 మంది సిబ్బంది ఉండేందుకు వీలుగా దీన్ని రూపొందించారు.

ట్రయల్స్‌ ఎలా నిర్వహించారంటే..?

వైస్ అడ్మిరల్ ఎకె చావ్లా సమక్షంలో ట్రయల్స్‌ జరిగాయి. కొవిడ్ -19 నిబంధనలను పాటిస్తూ ట్రయల్స్‌ నిర్వహించామని ఆయన తెలిపారు. దీంతో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ విమాన వాహక నౌకలు ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరిందని ఆయన పేర్కొన్నారు. 2022లో ఇది విధుల్లోకి చేరే అవకాశం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని