Interpol: 19 ఏళ్ల హరియాణా గ్యాంగ్‌స్టర్‌పై.. ఇంటర్‌పోల్‌ రెడ్‌ నోటీస్‌..

భారత్‌ నుంచి పారిపోయిన ఓ 19 ఏళ్ల గ్యాంగ్‌స్టర్‌పై ఇంటర్‌పోల్‌ (Interpol) నిఘా పెట్టింది. అతడిని పట్టుకునేందుకు రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది.

Published : 27 Oct 2023 16:50 IST

(Photo: Interpol Website)

ఇంటర్నెట్‌ డెస్క్‌: హరియాణా (Haryana)కు చెందిన ఓ 19 ఏళ్ల గ్యాంగ్‌స్టర్‌ (Gangster)పై ఇంటర్‌పోల్‌ (Interpol) రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. నేరపూరిత కుట్రలు, హత్యాయత్నం, నిషేధిత ఆయుధాలు, మందుగుండును ఉపయోగించడం వంటి అభియోగాలపై యోగేశ్ కడియన్‌ (Yogesh Kadian)పై ఈ నోటీసులు (red corner notice) ఇచ్చినట్లు తెలిపింది. అతడి గురించి సమాచారం ఇచ్చిన వారికి 1.5లక్షల రివార్డును కూడా ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన వివరాలు పొందుపర్చింది.

హరియాణాలోని ఝజ్జర్‌ జిల్లాకు చెందిన యోగేశ్ కడియన్‌ 17 ఏళ్ల వయసులోనే నకిలీ పాస్‌పోర్ట్‌తో అమెరికా పారిపోయినట్లు నిఘా వర్గాల సమాచారం. ప్రస్తుతం యూఎస్‌లో బబిన్హా గ్యాంగ్‌ వద్ద పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అధునాతన సాంకేతికతో ఆయుధాలు తయారు చేయడంలో యోగేశ్ నిపుణుడని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అతడికి ఖలిస్థానీ ఉగ్రవాదులతో కూడా సంబంధాలున్నాయనే అనుమానాలున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల దీనిపై విచారణ చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (NIA).. హరియాణాలోని యోగేశ్‌ ఇల్లు, ఇతర ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. తాజాగా అతడిపై ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది.

భారతీయులు ఆ దేశానికి వెళ్లాలంటే.. 1000 డాలర్ల ఫీజు కట్టాల్సిందే..!

స్వదేశం నుంచి పారిపోయి ఇతర దేశాల్లో నక్కిన నేరగాళ్లను పట్టుకునేందుకు ఇంటర్‌పోల్‌ ఇలా రెడ్‌ కార్నర్‌ నోటీసులు ఇస్తుంది. దీంతో ఇంటర్‌పోల్‌ సభ్య దేశాలు ఆ నేరగాళ్లను తమ భూభాగంలో ఉంటే వారిని గుర్తించి.. అదుపులోకి తీసుకుంటారు. అంతకుముందు పలువురు గ్యాంగ్‌స్టర్లు, ఖలిస్థానీ ఉగ్రవాదులపై కూడా ఇంటర్‌పోల్‌ ఇలాంటి రెడ్‌ నోటీసులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని