ISRO Chief: సోమనాథ్ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ పూజలు
ISRO Chief: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు.
వెరవల్: భారత అంతరిక్ష ఫరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని(Somnath Temple) దర్శించుకున్నారు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టే ప్రయోగాలు విజయవంతమయ్యేలా ఆశీర్వదించాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈ సందర్భంగా సోమేశ్వర్ మహాపూజ నిర్వహించిన ఆయన.. యజ్ఞంలోనూ పాల్గొన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. గిర్ సోమనాథ్ జిల్లాలోని వెరవల్ పట్ణణంలో ఉన్న ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఇస్రో చీఫ్ సోమనాథ్ విలేకర్లతో మాట్లాడారు. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ కావాలన్న తమ కల స్వామివారి కృపవల్లే సాకారమైందన్నారు. సోమనాథుడి ఆశీస్సులు లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. అందుకే తాను ఇక్కడికి వచ్చానన్నారు.
ఆకలి తీర్చిన మహనీయుడా.. ఈ దేశం మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోదు!
భవిష్యత్తులో ఇస్రో చేపట్టే మిషన్‌లకు ఆ మహాదేవుడి ఆశీస్సులు కోరినట్టు ఇస్రో చీఫ్ చెప్పారు. ‘మనం పనిచేయాలంటే బలం కావాలి. చంద్రుడిపై ల్యాండింగ్ మాకు ఓ టాస్క్. మాకు బలం అవసరమయ్యే అనేక ఇతర మిషన్లు మా ముందు ఉన్నాయి. అందుకే భగవంతుడి ఆశీస్సులు పొందేందుకు ఇక్కడికి వచ్చా’ అని అన్నారు. ఇస్రో చీఫ్ సోమేశ్వర్ మహాపూజ అనంతరం ఆలయ ప్రాంగణంలోని వినాయక ఆలయంలో యజ్ఞంలో పాల్గొన్నారని శ్రీసోమనాథ్ ట్రస్టు జీఎం తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడు తుదిశ్వాస విడిచినట్లు భక్తులు విశ్వసించే ప్రాంతం భాల్కతీర్థను సైతం ఆయన సందర్శించారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిషేధించిన పనే ఆదుకుంది
ర్యాట్ హోల్ మైనింగ్.. ఉత్తర్‌కాశీ సొరంగ ప్రమాద ఉదంతంతో రెండ్రోజులుగా ప్రాచుర్యంలోకి వచ్చిన పని ఇది. ఇంతవరకు ఈశాన్య రాష్ట్రాలకు, ప్రధానంగా మేఘాలయకు పరిమితమైన ఈ ప్రక్రియే చార్ధామ్ రహదారి పనుల్లో భాగంగా చిక్కుకుపోయిన కూలీలను బయటకు తెచ్చేందుకు ఉపయోగపడింది. -
Rat hole Miners: ‘మమల్ని గట్టిగా కౌగిలించుకున్నారు.. ఇలాంటిది జీవితంలో ఒకేసారి వస్తుంది’
సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకురావడంపై ర్యాట్ హోల్ మైనర్లు జాతీయ మీడియాతో మాట్లాడారు.


తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి తుపాను ముప్పు
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్‌పై ప్రశాంత్ నీల్ క్లారిటీ
-
Crime News: కాల్పులకు తెగబడినా.. చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ..!
-
Social Look: చీరలో మాళవిక హొయలు.. జాక్వెలిన్ ట్రిప్