Maldives Row: ‘ఆ గ్యారంటీ నేనివ్వలేను’: మాల్దీవుల వివాదంపై జైశంకర్‌

Maldives Row: ప్రతిసారి అన్ని దేశాలు భారత్‌కు మద్దతు ఇస్తాయన్న గ్యారంటీ ఏమీ ఉండదని విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్ అన్నారు.

Updated : 15 Jan 2024 14:07 IST

దిల్లీ: భారత్‌-మాల్దీవుల(India-Maldives) మధ్య దౌత్యపరమైన వివాదం నడుస్తున్న వేళ.. విదేశాంగ మంత్రి జై శంకర్(S Jaishankar) స్పందించారు. భారత దేశానికి ప్రతిసారి అన్ని దేశాల మద్దతు ఉంటుందని హామీ ఇవ్వలేమని వ్యాఖ్యానించారు.

భారత(India) ప్రధాని మోదీ, లక్షద్వీప్‌పై మాల్దీవుల (Maldives) మంత్రులు చేసిన వ్యాఖ్యలతో మనదేశం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది కాస్తా రెండుదేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలకు దారితీసింది. దీనిపై జైశంకర్‌(S Jaishankar)ను ప్రశ్నించగా.. ‘రాజకీయాలను రాజకీయాల్లాగే చూడాలి. ప్రతిదేశమూ ప్రతిరోజూ మన అభిప్రాయాలతో ఏకీభవిస్తుందని, మనకు మద్దతు ఇస్తుందని నేను గ్యారంటీ ఇవ్వలేను. గత పది సంవత్సరాలుగా ఈ ప్రపంచంతో భారత్‌ను అనుసంధానించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ క్రమంలో ఎన్నో విజయాలు సాధించాం’ అని అన్నారు. ఇతర దేశాలతో స్నేహపూర్వక సంబంధాల కోసం భారత్‌ చేస్తోన్న ప్రయత్నాల గురించి మాట్లాడారు. రాజకీయ సంబంధాల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ..  సాధారణంగా ఆయా దేశ ప్రజలు భారత్‌పట్ల సానుకూల భావాలను కలిగి ఉంటారన్నారు. భారత్‌తో సత్సంబంధాల ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారని చెప్పారు.

‘ఆపరేషన్‌ కాక్టస్‌’.. నాడు మాల్దీవుల్లో భారత సైన్యం అడుగుపెట్టిన వేళ..

ఇదిలా ఉండగా.. ఈ విభేదాలు నడుస్తోన్న తరుణంలోనే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు చైనాలో పర్యటించారు. స్వదేశానికి వచ్చిన తర్వాత తమది భౌగోళికంగా చిన్నదేశమే.. కానీ బెదిరించడం తగదని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా ప్రకటించింది. ఈ పరిణామాల మధ్యే తమ దేశంలో ఉన్న సైనిక దళాలను మార్చి 15లోగా ఉపసంహరించుకోవాలని మన దేశాన్ని ముయిజ్జు  కోరిన సంగతి తెలిసిందే. మాల్దీవుల్లో 88 మంది భారత్‌ సైనికులు విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని