PT Usha: పరుగుల రాణి పీటీ ఉషపై కేరళలో చీటింగ్ కేసు నమోదు

పరుగుల రాణి పీటీ ఉషపై చీటింగ్ కేసు నమోదైంది. పీటీ ఉష మోసం చేశారంటూ మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 20 Dec 2021 01:05 IST

తిరువనంతపురం: పరుగుల రాణి పీటీ ఉషపై చీటింగ్ కేసు నమోదైంది. పీటీ ఉష మోసం చేశారంటూ మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ బిల్డర్‌తో కలిసి ఉష తనను మోసం చేశారని జెమ్మా జోసెఫ్ ఆరోపించారు. ఉష హామీతో కేరళ కోజికోడ్‌లో ఓ బిల్డర్ నుంచి 1012 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ స్థలం కోసం విడతలవారీగా రూ.46 లక్షలు చెల్లించినట్లు వివరించారు. అయితే స్థలాన్ని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించకుండా బిల్డర్ ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేరకు పీటీ ఉష సహా నిర్మాణ సంస్థకు చెందిన మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోజికోడ్ జిల్లా పోలీస్ చీఫ్ ఏవీ జార్జ్.. ఈ పిటిషన్‌ను వెల్లాయిల్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు.

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని