Maharashtra: ‘ఎముకలు విరగ్గొట్టండి’.. జనాలపై పోలీసుల్ని పురమాయించిన మంత్రి

సహనాన్ని కోల్పోయి మహారాష్ట్ర(Maharashtra) మంత్రి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

Updated : 04 Jan 2024 17:40 IST

ముంబయి: ‘ఎముకలు విరగ్గొట్టండి’ అంటూ ఓ రాష్ట్రమంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌ కావడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఇటీవల మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన మంత్రి అబ్దుల్ సత్తార్‌(Abdul Sattar) పుట్టిన రోజు జరిగింది. ఆ రోజు రాత్రి ఒక ప్రముఖ డ్యాన్సర్‌తో ప్రదర్శన ఏర్పాటు చేశారు. దానికి భారీ సంఖ్యలో జనాలు హాజరయ్యారు. ప్రదర్శన జరుగుతున్న సమయంలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. వారి ప్రవర్తన గందరగోళానికి దారితీయడం.. మంత్రికి చిరాకు తెప్పించింది. వెంటనే మైక్‌ తీసుకొని.. అందరూ కూర్చొని డ్యాన్స్‌ చూడాలని అభ్యర్థించారు. అయినా కూడా పరిస్థితి అదుపులోకి రాకపోయేసరికి అసహనానికి గురయ్యారు. ‘వారంతా డ్రామా  చేస్తున్నారు. లాఠీ ఛార్జి చేయండి. ఎముకలు విరగ్గొట్టండి’ అంటూ అభ్యంతరకరంగా మాట్లాడుతూ పోలీసుల్ని పురమాయించారు. ఈ మాటలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుండటంతో  విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

‘ హాఫ్‌ రేటుకు అమ్మాలని.. రూ.కోటి విలువైన బూట్లు కాజేసిన కేటుగాళ్లు’

సత్తార్‌.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌శిందే నేతృత్వంలోని శివసేనకు చెందిన నేత. ఆయన మైనార్టీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఛత్రపతి శంభాజీనగర్‌ జిల్లాలోని సిల్లోడ్‌ అసెంబ్లీస్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు