Drugs: ₹135 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్‌.. తొమ్మిది మంది అరెస్టు!

మహారాష్ట్రలోని ఎన్సీబీ అధికారులు భారీగా డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు. ముగ్గురు విదేశీయులతో పాటు తొమ్మిది మందిని అరెస్టు చేశారు.

Published : 13 Oct 2023 22:38 IST

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టైంది. ఎన్సీబీ అధికారులు దాదాపు రూ.135కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలను సీజ్‌ చేశారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా వ్యవహారంలో ముగ్గురు విదేశీయులు సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. సీజ్‌ చేసిన డ్రగ్స్‌లో 6.9కిలోల కొకైన్‌, 200 కిలోల అల్ప్రాజోలం ఉన్నట్టు తెలిపారు. దక్షిణ ముంబయిలోని ఖేత్‌వాడీ ప్రాంతంలో ఓ హోటల్‌లో ఇద్దరు బొలీవియన్‌ మహిళల్ని అరెస్టు చేసిన ఎన్సీబీ అధికారులు.. వారి లోదుస్తులు, టూత్‌పేస్ట్‌, బట్టలు, కాస్మోటిక్‌ ట్యూబ్‌లు, సబ్బులు, పాదరక్షలు, మేకప్‌కిట్‌లలో దాచి ఉంచిన ఐదు కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ను వారు పొడి, లిక్విడ్‌, పేస్ట్‌ రూపాల్లో ఆయా వస్తువుల్లో దాచి ఉంచారని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌ కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. బ్రెజిల్‌లోని సావోపాలో కేంద్రంగా పనిచేస్తోన్న ముఠా వీరిద్దరినీ డ్రగ్స్‌తో భారత్‌కు పంపిందని అధికారులు తెలిపారు. అలాగే, పలుచోట్ల జరిపిన దాడుల్లో మరికొందరిని అదుపులోకి తీసుకొని మాదకద్రవ్యాలను సీజ్‌ చేసినట్టు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని